హత్రాస్: రెండేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్‌లో హత్రాస్ ఘటనను ఎవరూ మర్చిపోలేరు. యువతిపై దారుణంగా అత్యాచారం చేసి ఆమెను హింసించారు. ఈ ఘటన ఇప్పటికీ ప్రజలను కలచివేస్తూనే ఉంటుంది. ఈ దారుణాన్ని మరువకముందే అదే నిందితుడు ఇప్పుడు మరో ఘోరానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె తండ్రిని పొట్టన బెట్టుకున్నాడు. తుపాకితో కాల్చి అన్యాయంగా చంపేశాడు. హత్రాస్ ఘనట అత్యాచార కేసులో జైలుకెళ్లిన బెయిల్‌పై బయటకొచ్చాడు. వచ్చిన కొన్ని రోజులకే తనపై కేసు నమోదు చేసిన అమ్మాయి తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో హత్రాస్ పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హత్రాస్‌లోని సాస్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నైజార్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు నిందితుడి కుటుంబానికి, బాధితుల కుటుంబానికి మధ్య కాల్పులు జరిగాయని, ఆ సమయంలో అమ్మాయి తండ్రి గాయపడ్డారని, ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో బాధితుడు మరణించాడని హత్రాస్ పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసు గురించి హత్రాస్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ ‘2018లో నిందితుడు గౌరవ్ శర్మ అత్యాచార కేసులో జైలుకు వెళ్లాడు. ఆ తరువాత కొంతకాలానికి బెయిల్‌పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి ఇరు కుటుంబాలు ఒకరంటే ఒకరు కోపంగా ఉన్నాయి. అయితే ఇటీవల గౌరవ్ కుటుంబీకులు ఊరిలోని గుడికి వెళ్లారు.

అదే సమయంలో అమ్మాయి తండ్రి, ఇద్దరు కూతుళ్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పడు ఇరు కుటుంబాల మధ్య వాగ్వివాదం మొదలైంది. అది కాస్త పెరిగి పెద్ద గొడవ గా మారింది. అప్పుడు గౌరవ్ కోపంతో అతడిని షూట్ చేశాడ’ని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసుపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిథ్య నాథ్ పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం పోలీసులు కేసును మరిన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: