నేడు సహజ మరణాల కంటే.. రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయేవారే ఎక్కువయ్యారు. ప్రాణాలంటే లెక్కలేకనో.. లేక పోతే నాకెమవుతుందనే ధీమానో తెలియదు కానీ.. నిర్లక్షంగా డ్రైవింగ్ చేస్తూ.. వారు చావడమే కాకుండా ఎంతో అమాయకుల ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు. ఈ దారుణాలకు కొందరి కేర్ లెస్ డ్రైవింగ్ కారణమైతే .. మరికొందరిదేమో అడ్డదారుల్లో వెలుతూ.. అతి స్పీడుతో వాహనాలను నడుపుతూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కన్నవారికి కన్నీళ్లు మిగిల్చి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
మద్యం మత్తు చేసిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలను కోల్పోయారు. అర్థరాత్రి సమయంలో పెనుగొండ మండలంలోని కియారార్ల పరిశ్రమ పధాన గేటు వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారుణానికి గురైన కారు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  స్పీడ్ బ్రేకర్ వద్ద జాతీయ రహదారిపై ముందు నుంచి వెళ్తున్న ఓ వాహనం సెడెన్ గా స్పీడ్ తగ్గించింది. కానీ వెనక నుంచి వచ్చే కారు మాత్రం వేగంగా దూసుకు వచ్చి ఆ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దాంతో ఆ కారులో ఉన్న నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. ప్రమాదానికి గురైన వారిలో ఢిల్లీకి చెందిన ఓ యువతి ఉండగా.. ముగ్గరు యువకులు బెంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కాగా ప్రమాద స్థలంలో మృతుల ఆధార్ కార్డులు లభించాయి. ఇందులో ఢిల్లీకి చెందిన రేఖ(21), ఆంచల్ సింగ్(21), మహబూబ్ ఆలం(31), మనోజ్ మిట్టల్ (38) గా  మృతులను గుర్తించారు. కాగా ఇందులో మహబూబ్ ఆలం బెంగుళూరు వాసిగా, మనోజ్ మిట్టల్ నార్త్ బెంగుళూరు వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు పెనుగొండ ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. అయితే ప్రమాదానికి మూల కారణం మద్యం మత్తేనని భావిస్తున్నారు పోలీసులు. ఈ కారు నడుపుతున్న వ్యక్తి ఒక చేతిలో బీరు సీసా ఉండగా.. మరో చేతిలో స్టీరింగ్ ఉన్నదని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: