ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను మంచి పనుల కోసం కంటే చెడుకోసమే అతిగా ఉపయోగిస్తున్నారన్నది వాస్తవం. ఇలా చెడు పనుల కోసం సోషల్ మీడియాను వాడుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. కొందరు కేటుగాళ్లు యువతులనుు, మహిళలనే టార్గెట్ చేసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అసభ్యకరంగా ఉండే వీడియోలలను.. ఫోటోలు అప్ లోడ్ చేసేసి రాక్షసానందం పొందుతున్నారు దుండగులు. తాజాగా ఓ యువతికి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసిన ఆ యువతి షాక్ కు గురైంది. యాక్సెప్ట్ చేసిన క్షణాల్లోనే ఆ అకౌంట్ ఆమె ఫోటోలు.. అసభ్యకరమైన వీడియోలతో నిండిపోయింది.
దాంతో ఆందోళన చెందిన ఆ యువతి తన తల్లికి విషయం మొత్తం చెప్పింది. ఇక ఆలస్యం చేయొద్దని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బాధిత యువతికి(18) Aasha Oad పేరుతో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దాంతో ఆ యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసేసింది. కాగా ఆ అకౌంట్ లో బాధిత యువతి ఫోటోలు, అసభ్యకరమైన వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి భయపడిపోయిన ఆ యువతి వెంటనే ఆ విషయాన్ని తన తల్లికి తెలిపింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాంకేతికతతో విచరణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడు ఘట్లోడియా ప్రాంతానికి చెందిన కౌశిక్ పర్మార్(26) గుర్తించారు. కాగా నిందితుడు కౌశిక్ ను అరెస్టు చేసి విచారించారు. కాగా ఈ విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. యువతి అకౌంట్ లో ఉన్న ఫోటోలు.. అసభ్యకర వీడియోలన్నింటినీ కౌశికే తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసినట్టు అంగీకరించాడు. అయితే ఈ ఫోటోలను, వీడియోలను ఆ యువతి బంధువులకు కూడా పంపినట్టు కౌశిక్ విచారణలో వెళ్లడించాడు. వీటితో పాటుగా వారు విస్తుపోయే విషయాలను కూడా వెళ్లడించాడు. కౌశిక్ కు ముందే ఆయువతి, తన తల్లి తెలుసని తెలిపాడు. గతంలో కౌశిక్ వారి వద్ద పనిచేసినట్టు వెళ్లడించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: