ప్రస్తుతం ఏది కావాలన్నా మొదట ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడమే..అరచేతిలోకి అంతర్జాలం వచ్చాక అన్నినింటిని మొదట ఇంటర్నెట్ లోనే వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఏ వెబ్ సైట్ పడితే ఆ వెబ్ సైట్స్ లోకి లాగిన్ అవుతున్నారు. అయితే ఇంటర్నెట్ లో ఎందులోకి పడితే అందులోకి దూరవద్దని సైబర్ నిపుణులు హెచ్చరుస్తున్నారు. తెలిసిన వెబ్ సైట్ నుండే లాగిన్ అవ్వాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పోర్న్ సైట్ ల జోలికి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.  ప్రభుత్వ పథకాలకు సంబందించిన వెబ్ సైట్ ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. సమాచారం సులువుగా జరుగుతుందని నకిలీ వెబ్ సైట్ ల సంఖ్య పెరిగిపోయిందని అంటున్నారు. ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి సమాచారం తెలుసుకోవాలే గాని నేరుగా ఆన్లైన్ లో ప్రభుత్వ పథకాలను వెతకొద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం కస్టమర్ కేర్ నంబర్లు వెతికే వారి సంఖ్య పెరిగిపోతుంది.

దాంతో వివిధ సంస్థల పేరుతో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లను సృష్టించి మోసం చేస్తున్నారని..కాబట్టి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి నంబర్ తీసుకోవాలని సూచిస్తున్నారు. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లను కేవలం కేవలం గూగుల్ ప్లే మరియు ఐవోఎస్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. గూగుల్ నుండి యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ లు డౌన్లోడ్ చేసుకుంటే ఉన్న వైరస్ పోకపోగా కొత్త వైరస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గూగుల్ లో వెతికి ఆన్లైన్ బ్యాంకింగ్ చేయకూడదని..అధికారిక బ్యాంక్ వెబ్ సైట్ ల ద్వారానే లావాదేవీలు జరపాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆన్లైన్ లో కనిపించే గిఫ్ట్ కార్డ్స్ ను అస్సలు నమ్మవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గిఫ్ట్ కార్డ్ లు వచ్చే లింక్స్ ఓపెన్ చేస్తే ఫోన్ లోని స‌మాచారం దొంగ‌లించ‌బ‌డే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: