సాధార‌ణ మ‌హిళ‌ల‌కే కాదు ఉన్న‌త కుటుంబాల్లో జ‌న్మించిన వారికి కూడా వ‌ర‌క‌ట్న వేధింపులు త‌ప్ప‌డంలేదు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం ఎన్నో చ‌ట్టాలు వ‌స్తూనే ఉన్నాయి. క‌ఠిన శిక్ష‌ల‌ను అమ‌లు చేస్తూనే ఉన్నారు. కానీ కొంద‌రు మాన‌వ మృగాల్లో మార్పు రావ‌డంలేదు. తాజాగా వ‌ర‌క‌ట్న వేధింపుల కార‌ణంగా మరో మ‌హిళ బ‌లైంది. ఆమె సంపన్న కుటుంబంలో జ‌న్మించింది..ఉన్న‌‌తమైన చ‌దువులు చ‌దివింది. త‌న తండ్రికి బిజినెస్ లో అండ‌గా నిలిచింది. కానీ పురుషాహంకారం ముందు ఓడిపోయింది. వేధింపుల‌కు తాళ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వివ‌రాల్లో కి వెళితే.....ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మ‌హేంద్ర జైన్ కూతురు రషికా జైన్. విదేశాల్లో ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంది. రెండేళ్ల క్రితం ఇండియాకు తిరిగి వ‌చ్చింది. సింగ‌పూర్ నుండి ఇండియాకు వ‌చ్చిన త‌ర‌వాత తండ్రికి వ్యాపారంలో అండ‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ వ్యాపార వేత్త న‌రేష్ అగ‌ర్వాల్ కుటుంబం నుండి రిషికా జైన్ కు సంబంధం వ‌చ్చింది. న‌రేష్ అగ‌ర్వాల్ కుమారుడు వ్యాపార‌వేత్త కుశాల్ అగ‌ర్వాల్ సంభందం రాగా రిషికా కుటుంబ స‌భ్యులు ఓకే చెప్పేశారు.

అంతే కాకుండా రూ.7 కోట్ల క‌ట్నంతో పాటు క‌ట్న కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు. అలా రిషికా జైన్ న‌రేష్ జైన్ కుటుంబంలో ఎన్నో ఆశ‌లతో అడుగు పెట్టింది. కానీ పెళైన త‌ర‌వాత భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న చూసి షాక్ అయ్యింది. అత‌డు డ్ర‌గ్స్ కు బానిస అని తెలిసి ఆవేద‌న‌కు లోనైంది. అంతే కాకుండా అద‌న‌పు క‌ట్నం తేవాలంటూ వేధింపులు కూడా మొద‌ల‌య్యాయి. గ‌తేడాది వీరి వివాహం జ‌ర‌గ్గా భ‌ర్త లో మార్పు వ‌స్తుంద‌ని కొన్న‌ళ్లు ఎదురు చూసింది. ఈ విష‌యం తెలిసి రిషికా జైన్ తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించింది.  గొడ‌వ జ‌రిగిన ప్ర‌తి సారి పుట్టింటికి వెళ్ళే రిషికా త‌న తండ్రి ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో పుట్టింటికి వెళ్లి మ‌రింత ఇబ్బందికి గురిచేసిన‌ట్టు అవుతుంద‌ని భావించింది. త‌న‌లో తానే కుమిలిపోయి ఫిబ్ర‌వ‌రి 16 మూడో అంత‌స్తు నుండి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దాంతో ఆమె త‌ల్లి దండ్రులు కుటుంబీకులు కుషాల్ ఆగ‌ర్వాల్ ను క‌టినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో #JusticeForRashika అంటూ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: