మ‌తిస్థిమితం లేని యువ‌తిని మృగాళ్లు వ‌ద‌ల్లేదు. కోస్గి పట్టణంలో కొద్ది సంవ‌త్స‌రాలుగా మతిస్థితిమితం లేని మహిళ తిరుగుతోంది. ఎవరైనా కాస్త తిండి పెడితే తింటుంది. ఒక్కోసారి పడేసి పస్తు ఉంటుంది. ఎందుకు పడేస్తుందో కారణమేమీ ఉండదు. ఇష్టా ఇష్టాలేవీ తెలియని మానసిక స్థితి ఆమెది. పగలు ఆ కూడలిలోని హోటళ్ల దగ్గర, వీధుల్లో తిరుగుతుంది. రాత్రిళ్లు అక్కడే చెట్ల కింద పడుకుంటుంది. అలాంటి మనిషిని ఎవరో అత్యాచారం చేశారు. ఆమె గర్భిణి అయింది. ఆదివారం మూడోసారి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. గ‌తంలోనూ రెండుసార్లు ఇలాగే ఇద్ద‌రికి జ‌న్మ‌నిచ్చింది. బస్టాండ్‌ దగ్గర పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమెకు నొప్పులు రావడంతో స్థానికులు ప్రభుత్వ వైద్యురాలిని రప్పించి, ప్రసవం చేయించారు.


 ఆడబిడ్డ పుట్టింది. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన మ‌తిస్థిమితం లేని మ‌హిళ వెంట‌నే అక్క‌డి నుంచి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. వైద్యులు ఆపాల‌ని చూసిన వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు.ప‌సికందును స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది జిల్లా కేంద్రంలోని శిశుగృహకు త‌ర‌లించారు. ఇంతకుముందు పుట్టిన ఇద్దరు బిడ్డలనూ ఇలాగే శిశుగృహ సంరక్షణకు పంపారు. ఇప్పటికైనా బాధిత మహిళకు అధికారులు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు మ‌హిళ కుటుంబ స‌భ్యులు ఆద‌రించ‌క‌పోవ‌డంతోనే ఇలా రోడ్డున ప‌డింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  అమ్మానాన్నా కొన్నాళ్ల కింద‌ట చ‌నిపోయారు...  ఆ త‌ర్వాత ఆమె మాన‌సికంగా కుంగిపోయింది.


తోడ‌బుట్టిన వారు ప‌ట్టించుకోలేదు. దిక్కులేని స్థితిలో రోడ్డున ప‌డింది. బిచ్చమెత్తుతూ రోడ్లపైనే తిరుగుతూ బ‌తుకుతోంది.  ఈక్ర‌మంలోనే కొందరు మృగాళ్లు లైంగికదాడులు చేయడంతో అభాగ్యురాలు ఇప్పటికి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇంత జరుగుతున్నా, అధికారులు చోద్యం చూస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  భారతావనిలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: