దేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ‌స్ట్ వేవ్ లో ఎంతో మంది క‌రోనా సోకిన త‌ర‌వాత భ‌యంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోగా మ‌రికొంద‌రు త‌మ కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకింద‌ని సైతం మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. ఇక సెకండ వేవ్ లోని అలాంటి ఘ‌ట‌న‌లే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే పెద్ద‌ప‌ల్లి జిల్లాలో చోటుచేసుకుంది. సుల్తానాబాద్ కు చెందిన పెడ‌గ మ‌ల్లేశం 41 రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కోన‌రావుపేట మండ‌లం మ‌రిమ‌డ్ల‌లోని గురుకుల పాఠ‌శాల‌లో ఒప్పంద అసిస్టెంట్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఎల్లారెడ్డి పేట‌లో బ్యాచిల‌ర్ గా గ‌దిని అద్దెకు తీసుకుని జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌తి రోజూ మల్లేశం గురుకులానికి వెళ్లి వస్తుంటాడు. ఇదిలా ఉండ‌గా మ‌ల్లేశ త‌ల్లి మ‌రియు తండ్రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. తీవ్ర‌మైన జ్వ‌రం ఒల్లునొప్పుల‌తో వారు క‌రీంన‌గ‌ర్ లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. అయితే వారిలో మ‌ల్లేశం త‌ల్లి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

తల్లి దండ్రుల‌తో క‌లిసి ఆస్ప‌త్రికి వెళ్ళిన మ‌ల్లేశం రెండు రోజుల క్రితం స్వ‌గ్రామానికి వెళ్లారు. త‌ల్లి దండ్ర‌లు క‌రోనా బారిన ప‌డ‌టంతో మ‌ల్లేశం తీవ్ర మ‌న‌స్తాపానికి గురయ్యారు. ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇంట్లో బాత్రూంలోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించారు. అరుపులు వినింపించ‌డంతో చుటుప‌క్క‌ల వారు వెళ్లి మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. అనంతరం ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న ఎస్సై కిష‌న్ రావు ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించారు. మృతుడి బావ తిరుప‌తి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసును న‌మోదుచేసుకున్నారు. ఆత్మ‌హత్య‌కు ముందు మ‌ల్లేశం రాసిన సూసైడ్ నోట్ అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తుంది. జీవితం పై విర‌క్తితో చ‌నిపోతున్నాన‌ని త‌న చావుకు ఎవ‌రూ బాధ్యులు కార‌ని పేర్కొన్నారు. త‌న అక్క బావ అంద‌రూ మంచి వారేన‌ని తెలిపారు. త‌న ఆస్తి మొత్తం మేన‌ళ్లుల్ల‌కు చెందాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా గురుకులం ఎన్నో క‌ష్ట సుఖాల‌ను చూసాన‌ని...గురుకుల మిత్రుల‌కు న‌మ‌స్కారం అంటూ లేఖ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: