కరోనా ఈ పేరు వింటేనే జనాల్లో భయం పుడుతుంది.. ఎప్పుడు ఎవరిపై ప్రభావాన్ని చూపిస్తుందో ఎవరికీ అర్థం కాదు..ఒకవైపు వైద్యం అందక చనిపోతున్నారు..మరో వైపు కరోనా వైద్యం అంటూ మోసాలు చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు.. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగు చూసింది.. అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది.. 


హోమియా వైద్యం వికటించి ఎనిమిది మంది మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం లోని బిలాస్ పూర్ లోని కోర్మీ గ్రామంలో జరిగింది. బాధితులకు వైద్యం చేసిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. దేశీయంగా తయారు చేసిన మద్యం ఆల్కహాల్ ఉన్న హోమియోపతి మందు డ్రోసెరా 30 తీసుకొన్నారు. ఈ మందు వాడిన తర్వాత ఒకే కుటుంబం లోని 8 మంది మృత్యు వాతపడ్డారు. మిగిలిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఫస్ట్ ముగ్గురు ఈ మందు తీసుకుని అక్కడిక్కడే చనిపోయారు.


ఇలా మరి కొంతమంది చనిపోవడం తో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.. బిలాస్‌పూర్ లోని కోర్మి గ్రామంలో 12 మంది సభ్యులున్న కుటుంబం ఆల్కహాలిక్ హోమియోపతి మందును తీసుకొన్న తర్వాత ఈ ఘటన చోటు చేసుకొందని సీఎంఓ ప్రకటన విడుదుల చేసింది.. ఈ హోమియోపతి మందు లో ఆల్కహాల్ ఉన్నందున వీరు చనిపోయి ఉంటారని సీఎంఓ తెలిపింది. ఒకే కుటుంబాని కి చెందిన సభ్యులు 8 మంది మరణించడం తో గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకండి.. డాక్టర్లు సూచించిన వైద్యులను సంప్రదించాలని హెచ్చరించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: