గుంటూరు జిల్లాలో ఎవరు ఊహించని రేంజ్ లో దొంగతనం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఇలా కూడా దొంగతనాలు చేస్తారా? అసలు ఎవరిని నమ్మాలి కరోనా కాలంలో అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మనీషాకు గుంటూరు వికాన్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాధా దేవి కుటుంబంతో పరిచయం ఉంది. ఆ రెండు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. అప్పుడప్పుడూ గుంటూరు వెళ్లి రాధాదేవి ఇంటికి వచ్చి మనీషా కష్ట సుఖాలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ తరుణంలో ఏప్రిల్‌ 28న మనీషా తన తల్లి రూన్సీతో కలిసి గుంటూరు వికాస్‌నగర్‌లోని రాధాదేవి ఇంటికి వచ్చింది

ఇరాక్ మనీషాకు పెళ్లి కుదిరింద‌ని పిలవడానికి వచ్చినట్లు వారు చెప్పారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన రాధాదేవి.. వారికి విందు భోజనం ఏర్పాటు చేసింది. పెళ్లి ముచ్చట్లు, కరోనా ముచ్చట్లతో అక్కడే ఆలస్యమైంది. ఇక కర్ఫ్యూ ఉండడంతో రాత్రికి ఇంటిలో ఉండి.. మరుచటి రోజు వెళ్లమని రధాదేవి చెప్పింది. రాధాదేవి చెప్పిన మాటలకు సరే అన్న మనీషా, వాళ్ల అమ్మ కూడా రాత్రికి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుతూనే ఒంగోలుకు వెళ్లిపోయారు.

అయితే తరువాత ఏదో పని మీద రాధాదేవి బీరువా ఓపెన్ చేసి చూసి షాక్ కు గురైంది. ఇక అందులో ఉండాల్సిన బంగారపు వడ్డాణం, చెవిదిద్దులు, నక్లెన్‌, పట్టుచీర అన్నీ మిస్ అయ్యాయి. వెంటనే రాధాదేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదటి అనుమానితులుగా మనీషా, ఆమె తల్లి రూన్సీలే అని భావించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని త‌మ‌దైన స్ఠైల్లో విచారించ‌గా చోరీ చేసిన‌ట్లు అంగీక‌రించారు. ఇద్దరిని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద సోమవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 10 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక కరోనా కాలంలో ఎవరిని నమ్మాలి అని గుంటూరు వాసులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: