దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్యా రోజురోజుకు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటి కేసులు, మరణాలు సంఖ్య పెరగడం గమనార్హం అనే చెప్పాలి. ఇక పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో కీలక ఘట్టం. రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది. ఇక అమ్మాయి కన్నవారిని కాదనుకొని తాళి కట్టినవాడి కోసం మెట్టినింట్లో అడుగు పెడుతుంది. ఇక పెళ్ళై వారం కూడా గడవక ముందే వధువు జీవితంలో విషాదం నెలకొంది.

తాజాగా ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో పెళ్లి అయిన ఐదు రోజులకే నూతన వరుడు వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచాడు. రాజ్ కానిక మండలం, దుర్గదేబిపాడా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ నాయక్.. బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో కొలువు చేస్తున్నాడు. మే 1న సొంతూరికి వచ్చాడు. వచ్చే ముందే బెంగళూరులో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. కానీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ క్ర‌మంలో మే 9న అతని పెళ్లి జరిగింది.

ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే అతని ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. వివాహం అనంతరం కరోనా సింట‌మ్స్ బయటపడ్డాయి. కానీ పెళ్లి స‌మ‌యంలో అధికంగా స్నానం చేయటం వల్ల జ‌లుబు, జ్వరం ల‌క్ష‌ణాలు వ‌చ్చి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావించారు. జ్వరం మాత్రలు వేసుకున్నా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆరోగ్యం బాగాలేకున్నా ముహూర్తం వ‌ల్ల‌ మే 12న శోభనం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. అనంతరం అతని ఆరోగ్యం మరింత క్షీణించగా.. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్ల‌డించారు. అతని ఆరోగ్యం మరింత విషమించడం వల్ల భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్ట‌ర్ల‌ సూచించారు. అక్కడికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే సంజయ్ చ‌నిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: