కంప్యూటర్ టెక్నాలజీ మీద కాస్త అవగాహన ఉన్న వారికి అయినా ఒరాకిల్ అనే సంస్థ గురించి తెలిసే ఉంటుంది.. అలాంటి సంస్థకు ఇండియాలో సీనియర్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తి స్వార్థం కోసం చేసిన పని ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకు వస్తోంది. తాజాగా ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ బాగోతం బయట పడిందని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్ అలాగే అతని భార్య మీను అగర్వాల్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 



పలు వెబ్ సైట్స్ లో యాడ్స్ చూపించి ప్రాజెక్టుల పేరుతో భారీగా ప్రదీప్ అగర్వాల్ దంపతులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పేమెంట్ చేయలేని క్లయింట్ల మీద ఒరాకిల్ ఇండియా సీనియర్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్, భార్య ఇద్దరూ కలిసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒరాకిల్ ఇండియా పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ప్రాజెక్టులను పోస్ట్ చేస్తూ క్లయింట్లను ప్రదీప్ అగర్వాల్ దంపతులు ఆకర్షిస్తున్నారు. 



అలా ఒక్కసారి క్లైంట్ గా మారిన తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చి డబ్బు చెల్లించకపోతే వారి మీద సెక్స్ వల్ హరాస్మెంట్ ఆరోపణలు కూడా మీను అగర్వాల్ చేస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే MADS క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి అందులో లేని ప్రాజెక్టుల పేరుతో క్లయింట్ లకు ఎర వేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశం మీద తెలంగాణ పోలీసులు రెండు సెక్షన్ల కింద ఇద్దరి మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం. 18లోపు తమ ఎదుట హాజరు కావాలని జూబ్లీహిల్స్ పోలీసులు నోటిసులు జారీ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: