ఈ మ‌ధ్య ప్రేమ పేరుతో దారుణాలు చాలా పెరిగిపోతున్నాయి. చాలా మంది ప్రేమిస్తున్నామ‌ని వెంట‌ప‌డి యువ‌తుల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తాజాగా జ‌రిగిన  ఈ ఘ‌ట‌న తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. కడప జిల్లాలో ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబసభ్యులే దారుణ‌మైన ఘ‌ట‌న‌కు ఒడిగ‌ట్టారు.

ఏకంగా ఆ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి ప్ర‌య‌త్నించారు. ఈ ఘోర సంఘటన కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి తీవ్ర క‌ల‌క‌లం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉంది. కుటుంబసభ్యులు కొంతకాలంగా యువతికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తూ బిజీగా ఉన్నారు. కాగా పెళ్లి చేసుకునేందుకు యువ‌తి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు ఇదే పెళ్లి విషయంపై మ‌రోసారి యువతిని బలవంతం చేయగా ఆమె కూడా నిరాకరించింది.

దీంతో యువ‌తికి, కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య గొడవ రావ‌డంతో సోదరుడు, తల్లి, తండ్రి ఆమెపై పెట్రోల్‌ పోసి దారుణంగా నిప్పంటించారు. కాగా యువతి ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగున్న వారు వెంట‌నే వచ్చి మంటలను ఆర్పి కాపాడారు. ఆ త‌ర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు.

కాగా గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక పోలీస్ స్టేష‌న్ సీఐ రాజు చెప్పారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లిన‌ట్టు పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగంగా చేస్తున్నారు. వద్దని చెబుతున్నా.. అన్న తాజుద్దీన్ యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడ‌ని స‌ద‌రు యువతి తండ్రి చెప్పాడు. అయితే ఈ సంఘటన త‌ర్వాత యువతి అన్న తాజుద్దీన్ పారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: