అమ్మాయిలు ఒక్కోసారి ఎంతో తెలివైన వాళ్ళుగా ప్రవర్తిస్తారు.. మరోసారి మాత్రం ఎందుకిలా చేస్తున్నారు.. వీళ్లకు పిచ్చి పట్టిందా? అనే సందేహాలు కలుగుతాయి. చేసే చిన్న తప్పే జీవితనాన్ని నాశనం చేస్తుంది. అత్యాశ మనిషిని ఎలా తయారు చేస్తుందో తెలియాలంటే ఒక్కసారి ఇది చదవాల్సిందే.. ఓ చలాకి అమ్మాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యింది. అలా అయ్యిందో లేదో చెన్నైలో మంచి కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించింది.


అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని.. అనే సామెతకు తగ్గట్లు ఆ యువతికి డబ్బు మీద ఆశ పెరిగింది. ఉన్న ఉద్యోగం తో.. వస్తున్న జీతం తో సంతృప్తి చెందలేదు. ఇంకా ఎదో కావలి  అంటూ సంఘ వ్యతిరేఖ చర్యలకు పాల్పడింది.. పోలీసులకు అడ్డంగా బుక్కయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన రేణుక చెన్నైలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆ సమయం లోనే క్లాస్‌మేట్ సిద్ధార్థ్‌ తో ప్రేమలో పడింది. చదువు తర్వాత రేణుక ఉద్యోగం లో చేరగా, సిద్ధార్థ్ మాదక ద్రవ్యాలకు బానిసగా మారాడు.


బెంగుళూరు లో ఆ గంజాయిని అమ్మాలని ప్లాన్ వేసుకున్నారు. న్యూ బెల్ రోడ్‌లోని ఐఐటీ పార్క్ వద్ద రేణుక గంజాయిని అమ్మేందుకు ప్రయత్నించింది. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద ఉన్న మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ఆమె దగ్గర గంజాయి తో పాటుగా పది వేల వరకు ఉన్న నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా సంపాదించడానికి వాళ్లకు సహకరించిన సహకరించిన బీహార్‌ కు చెందిన సుధాంశును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. అత్యాశకు పోయిన ఈ యువతికి చివరికి జైల్లో చిప్ప కూడె మిగిలింది..


మరింత సమాచారం తెలుసుకోండి: