దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని అల్లాడి పోతుంది. ఇలాంటి సమయంలో ప్రజలందరూ దుర్భర స్థితిని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మనిషి మనిషికి సహాయం గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో కూడా మానవత్వాన్ని మరిచి పోతే ఇక మానవాళికే ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు.  కానీ కరోనా కష్ట సమయంలో అందరిలో మానవత్వం కరువైపోతుంది. కష్ట సమయంలోనే కఠినాత్ములు గా మారిపోతున్నారు. చివరికి  సాటి మనుషుల పట్ల జాలి దయ మరిచి దారుణం గా వ్యవహరిస్తున్నారు.



 ముఖ్యంగా ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన రోగుల పట్ల కొంతమంది వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉంది. ఏకంగా కన్నవారే కరోనా వైరస్ బారిన పడిన తల్లిదండ్రులను రోడ్డుమీద పడేసే పరిస్థితి వచ్చింది. ఆసుపత్రికి వెళితే అక్కడ ప్రాణాలు దక్కుతాయో దక్కవొ అన్న భయం పట్టుకుంది. అయితే ఇక్కడ ఒక రోగి ఆసుపత్రికి వెళ్లి మనోధైర్యంతో  వైరస్ తో పోరాటం చేస్తోంది. సదరు మహిళను కరోనా ఏమి చేయలేక పోయింది. కానీ మానవత్వాన్ని చూపించాల్సిన మనిషి చివరికి ప్రాణం తీసింది. డబ్బు,సెల్ఫోన్ కోసం ఏకంగా దారుణంగా హత్య చేసింది.



 ఈ దారుణ ఘటన చెన్నైలోని తిరువొట్టియర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే సునీత అనే మహిళ ఇటీవలే కరోనా వైరస్ బారిన పడింది.  ఈ క్రమంలోనే చికిత్స కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడే కరోనా రోగులకు సేవలు చేసేందుకు కాంట్రాక్ట్ వర్కర్ రతీదేవి పనిచేస్తుంది. కరోనా వైరస్ బారినపడి  ఆసుపత్రిలో చేరిన సునీత దగ్గర నగదు, సెల్ఫోన్ చూసింది రతీదేవి. ఎలాగైనా అవి దక్కించుకోవాలి అనుకుంది. ఇక ఆసుపత్రిలో సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో.. ప్లాన్ ప్రకారం కత్తితో దారుణంగా  గొంతుకోసి హత్య  చేసింది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపడం తో ఈ విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: