ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత భార్యాభర్తలు ఒకరికి ఒకరు చివరి వరకు తోడుగా ఉండాలి.  కష్టసుఖాల్లో అండగా నిలబడాలి.  ఎంతో అన్యోన్యంగా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. ఇక్కడ ఒక జంట నూ చూస్తే ఇదే అనిపిస్తుంది.ఎంతో ముచ్చటైన జంట..  అన్యోన్య దాంపత్యం.. ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణం.. కష్టసుఖాల్లో ను ఒకరికి ఒకరు తోడు. ఇక్కడ కనిపించే జంటకు ఎన్ని ట్యాగ్స్ అయినా ఇవ్వచ్చు. కానీ ఈ జంట చేస్తున్న పనులు తెలిస్తే మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటారు. అన్యోన్యతకు మారుపేరుగా ఉన్న ఈ భార్య భర్తలు చేస్తున్న మోసాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.


 ఇప్పటివరకు మంచివాళ్లు గా నమ్మించి ఏకంగా 40 లక్షలు కాజేసారు. ఇక ఎవరికీ దొరకకుండా మకాం మార్చేశారు  మహారాష్ట్రలో ఈ అన్యోన్య చోరీ దంపతుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయింది.  పరమేశ్వర్ అనే 33 ఏళ్ల వ్యక్తి పూణే లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇక రెండేళ్ళ క్రితం అతనికి స్నేహితుడి ద్వారా శుభం గౌర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇన్కమ్ టాక్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను అంటూ చెప్పాడు శుభం గౌర్.  ఇక ఆ తర్వాత వీరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. ఓ రోజు తన అవసరాల నిమిత్తం ఐదు లక్షలు అడుగగా వెంటనే ఇచ్చేశాడు పరమేశ్వర్.



 అయితే ఐదు నెలల్లోనే ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు శుభం గౌర్.  ఇక ఆ తర్వాత ఇద్దరి కుటుంబాల మధ్య మంచి పరిచయం కూడా ఏర్పడింది. ఇరు కుటుంబాలు ఒకరింటికి ఒకరు రాకపోకలు కూడా జరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే లిక్కర్ షాప్ కు అనుమతి ఇస్తానంటూ శుభం గౌర్ పరమేశ్వర్ ని మాటలతో నమ్మించాడు. ఇక దీంతో శుభం గౌర్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు పరమేశ్వర్. ఇలా ఏకంగా 40 లక్షల రూపాయలు వరకు వసూలు చేశాడు. ఇక అతని భార్య కూడా ఇదే విషయంపై కుటుంబ సభ్యులతో మాయమాటలతో నమ్మించింది. ఇక లాక్ డౌన్ వల్ల ఇంటికి వెళ్ళిన పరమేశ్వర్ ఇక ఆ తర్వాత తిరిగి వచ్చి శుభం గౌర్ తో మాట్లాడడానికి వెళ్ళగా.. ఇంటికి తాళం వేసి ఉంది. ఇక ఎవరిని అడిగిన సమాచారం తెలియ లేదు. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భార్య భర్తల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: