చెడ్డి గ్యాంగ్.. ఈ పేరు చెబితే చాలు హైదరాబాద్ నగర వాసులు అందరి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ గ్యాంగ్ చేసే దొంగతనాలు ఆ రేంజిలో ఉంటాయి కాబట్టి. ఇంటికి తాళం వేసి కాస్త బయటికి వెళ్లారు అంటే చాలు ఇక ఇంటికి వచ్చేసరికి ఇల్లు అక్కడే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు మాత్రం ఎక్కడా కనిపించవు. అయితే పోలీసులు ఈ గ్యాంగ్  పట్టుకునేందుకు ఎంత నిఘా ఏర్పాటు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా తప్పించుకుంటూ చోరీలకు పాల్పడుతునే ఉంది ఈ గ్యాంగ్   ప్రస్తుతం దొంగతనాలకు పాల్పడే ఈ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో కొనసాగుతోంది  పోలీసులు ఇక వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగిన వీరు మాత్రం ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు.



 ఎంతో చాకచక్యంగా ఇళ్లకు తాళాలు పగలగొట్టి ఇక అందినకాడికి దోచుకో పోతూ ఉంటారు.ముందుగా తాను దొంగతనం చేయాలి అనుకున్న ఏరియాలు ధనవంతుల ఇల్లు ఎక్కడ ఉన్నాయి అన్న విషయంపై పక్కాగా రెక్కీ నిర్వహిస్తూ ఉంటారు  అయితే ఇటీవలి కాలంలో మరోసారి హైదరాబాద్ శివార్లలో చెడ్డి గ్యాంగ్ కు సంబంధించిన ఫుటేజీలు సీసీ కెమెరాలో రికార్డు అవుతూ ఉండడంతో ఇక నగరవాసులు అందరిని మళ్ళీ బెంబేలెత్తిస్తోంది.  ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు  అంతేకాదు వివిధ బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తున్నారు



 ముందుగా  చెడ్డి గ్యాంగ్ లోని మహిళలు దుప్పట్లు కప్పుకుని బొమ్మలు విక్రయిస్తున్నట్లు గా అన్నీ కాలనీలలో సంచరిస్తూ ఉంటారట. ఆ తర్వాత పెద్ద పెద్ద ఇండ్లు బాల్కనీ లో విలువైన వస్తువులు లేదా బట్టలు చూస్తూ ఇక వాటి ఆధారంగా ఖరీదైన ఇళ్లు ఏవి అనే విషయాన్ని గ్రహిస్తారట.అట ఆ తర్వాత వారు వెళ్లి చెడ్డీగ్యాంగ్ లోనే పురుషులకు ఈ సమాచారం చెప్పడంతో... ఇక పక్కా ప్లాన్ తో చెడ్డి గ్యాంగ్ ఇక ఒంటికి మొత్తం ఆయిల్ పూసుకొని రంగంలోకి దిగుతారట. అర్ద రాత్రి దాటిన తర్వాత నగరం మొత్తం నిద్రపోతున్న సమయంలో చెడ్డీగ్యాంగ్ కాలనీలోకి ప్రవేశిస్తారు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారి నడక శబ్దం కూడా రాకుండా చెప్పులను చేత పట్టుకోవడం లేదా నడుముకి కట్టుకోవడం వంటివి చేస్తారట.ఇనుప రాడ్ తో ఎలాంటి శబ్దం రాకుండా తాళం పగులగొట్టి అందినకాడికి దోచుకో పోతారట. అందుకే ఇలాంటి వారు ఎవరైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని పోలీసులకు సమాచారమందించాలని సూచిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: