ఈ మధ్యకాలంలో దొంగల బెడద  చాలా ఎక్కువ అయిపోయిందబ్బా.. ఎక్కడ చూసినా దోపిడిలు దొంగతనాలు.. అయితే ప్రస్తుతం ఎక్కడ బడితే అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు అందరు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు సీసీ కెమెరాలు పెడితే.. కొన్ని ప్రాంతాల్లో  జనాలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.  కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఆ దొంగల ఆధీనం లోకి వెళ్ళి పోతున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది . ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారో తెలియడం లేదు కానీ సీసీ కెమెరాలకు చిక్కకుండా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా దొంగతనానికి వచ్చిన దొంగ పక్కా ప్లాన్ ప్రకారం వస్తారు.


 అప్పటికే రెండు మూడు రోజులు రెక్కి నిర్వహించి ఇక తాను దొంగతనం చేయాలి అనుకున్న ప్రాంతంలో చోరీ కోసం పక్క ప్లాన్ సిద్ధం చేసుకుంటాడు. ఎలా లోపలికి వెళ్లాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆభరణాలు దొంగతనం చేయాలి..  మళ్లీ ఎలా బయటికి రావాలి అనే విషయాన్ని ముందుగానే ఆలోచించుకుని ఉంటాడు. ఇక చాలా మంది దొంగలు ఇలా పక్కా ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్గా దొంగతనాలు చేస్తే.. కొంత మంది మాత్రం కొన్ని కొన్ని సార్లు చివరికి దొరికిపోయి కటకటాల పాలు అవుతూ ఉంటారు  కానీ మరికొంతమంది చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు  వెళ్లిన పని మరచిపోయి హాయిగా నిద్ర పోతూ ఉంటారు  ఇక్కడ మనం మాట్లాడేది కూడా ఇలాంటి దొంగ గురించే.



 ఇటీవలే దొంగ ఆలయంలోకి నగల దొంగలించేందుకు ప్రయత్నించాడు  ఎంతో కష్టపడి లోపలికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం వెళ్లిన పని మర్చిపోయి హాయిగా నిద్రపోయాడు. ఈ ఘటన  చంద్రయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది   వివరాల్లోకి వెళితే.. చంద్రయాన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి బాబా ఆలయం ఉంది. అయితే ఉదయం సమయం లో పూజారి వచ్చి తలుపులు తెరవగా.. లోపల ఒక బాలుడు నిద్రపోయి కనిపించాడు. ఇక వెంటనే పలువురికి  సమాచారం అందించిన పూజారి ఆ బాలుడునీ నిద్రలేపాడు. ఇక బాలుడి వద్ద ఉన్న సంచి తెరిచి చూడగా అందులో అమ్మవారి వెండి వడ్డానం, త్రిశూలం,కత్తి,వస్త్రాలు కన్పించాయి. ఇక బాలుడునీ నిలదీయగా దొంగతనానికి వచ్చానని కానీ నిద్ర రావడంతో ఇక్కడ పడుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. పోలీసులు ఆ బాలుని అరెస్టు చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: