సీరియల్ కిల్లర్ గురించి ఇటీవల కాలంలో చాలా మంది వింటున్నారు చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సినిమాల్లో సీరియల్స్ లో ఇలాంటి కాన్సెప్ట్ తోనే ఎక్కువగా తెరమీదకు వస్తున్నాయి. ఎప్పుడు సభ్యసమాజంలో ఒక సాధారణ మనిషి గానే బ్రతుకుతుంటారు కానీ సమయం వస్తే మాత్రం సైకో బయటకు  వచ్చి అందరిని  దారుణంగా హత్య చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లో చూస్తున్నప్పుడు వామ్మో వీడు మనిషా లేకపోతే మృగమా అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కాదు కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి సీరియల్ కిల్లర్ సినిమాలో చూసినప్పుడు భయపడిపోతుంటారు. ఇంతకీ ఇలా సీనియర్ కిల్లర్ గురించి ఎందుకు ఇప్పుడు ప్రస్తావన వచ్చింది అంటారా.



 ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే సీరియల్ కిల్లర్స్ కనిపించే వారు.. వరుసగా హత్యలు చేసే వారు. కానీ ఇటీవలి కాలంలో నిజజీవితంలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో జనాలు బెంబేలెత్తి పోతున్నారు. ఇటీవలే అమెరికాలో ఏకంగా 77 ఏళ్ల సీరియల్ కిల్లర్ ఇటీవలే మృతి చెందడం హాట్ టాపిక్ గా మారిపోయింది. 77ఏళ్ల వృద్ధుడు ఆ వయసులో ఏం చేస్తాడు అని అంటారా.  ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన 77 ఏళ్ల సీరియల్ కిల్లర్ ట్రాక్ రికార్డ్ తెలిస్తే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అతను ఏకంగా 130 హత్యలు చేశాడు.



 అమెరికాలో 130 హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ కిల్లర్ రోడ్ని జేవ్ అలకల అనే 77ఏళ్ల వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మరణించినట్లు అమెరికా పోలీసులు స్పష్టం చేశారు. గత కొంత కాలం నుంచి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఇక ఇటీవల మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. 1977 - 79 మధ్య కాలిఫోర్నియాలో వరుసగా 5 హత్య కేసులో నిందితుడిగా పట్టుబడ్డాడు రోడ్ని. ఆ తర్వాత కోర్టు అతనికి భారీగా శిక్ష విధించింది. ఇక అతన్ని విచారిస్తున్న క్రమంలో అప్పటివరకు 130 హత్య చేసినట్లు తెలిసింది. అయితే ఇక ఈ సీరియల్ కిల్లర్ ఎవరైనా మహిళను హత్య చేస్తే వారి చేవి పోగులను ఇక తన ట్రోఫీ భావించేవాడట. ఇలా 130 హత్య సీరియల్ కిల్లర్ మరణం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: