ప్రస్తుతం దేశంలో పోర్న్ పూర్తిగా బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటికీ కూడా ఏదో ఒక విధంగా జనాలు పోర్న్ కి బానిసలుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పోర్న్ చూడటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి అని తెలిసినప్పటికీ.. పోర్న్ చూడటం మాత్రం ఆపడం లేదు  అయితే మొన్నటి వరకు కేవలం పెద్దలు మాత్రమే చూసేవారు.  కానీ ఇప్పుడు మాత్రం పెద్దలు చిన్నలు అనే తేడా లేదు ఇంటర్నెట్ సదుపాయం ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నిషేధం ఉన్నప్పటికి ఏదో ఒక విధంగా పోర్న్ వీడియోలు చూస్తూ పెడదారి పడుతున్నారు చిన్నారులు.


 ఎంతో మంది పెద్దలు కూడా పోర్న్ వీడియోలకు బానిసలుగా మారిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇలా వీడియోలు చూడొద్దు అంటూ అటు పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ జనాల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. రోజు రోజుకి పోర్న్ వీడియోలు వల్ల తిను అనర్థాలు జరిగిపోతున్నాయి. అంతేకాదు పోర్న్ వీడియోలు చూస్తున్న ఎంతోమంది ని టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు వినూత్నరీతిలో బ్లాక్మెయిలింగ్ కి దీంతో భారీగా డబ్బులు దండుకుంటున్నారు.



 ఇటీవలి కాలంలో పోర్న్ వీడియోలు చూస్తున్న వారికి కాల్ చేసి మేం పోలీసులం.. ఫైన్ కట్టాలి అంటూ ఎంతో మంది సైబర్ నేరగాళ్లు జనాల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. అయితే తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో ఒక ముఠాని అరెస్టు చేశారు. పోలీసులం అంటూ అశ్లీల వీడియోలు చూస్తున్న వారికి కాల్ చేసి ఫైన్ పేరుతో భారీగా డబ్బులు దండుకుంతున్నారు.  అంతేకాకుండా బోగస్ నోటీసులు కూడా పంపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఈ కేసులో చెన్నైకి చెందిన జేమ్స్, రామ్, దిల్ శ్యాంత్ లను అరెస్ట్ చేశారు. అయితే ప్రజల నుంచి ఈ ముఠా ఏకంగా 30 లక్షల వరకు కాచేసినట్లు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: