మహిళలు మరియు చిన్నారులపై యాసిడ్ దాడికి పాల్పడడం హత్య చేసిన దానికంటే  దారుణమని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు  తెలియజేసింది. ఇలాంటి వాటికి  అడ్డుకట్టవేసేందుకు కఠినంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా తెలియజేసింది. అక్కడే ఉన్నటువంటి  ఉపాధ్యాయురాలు పై యాసిడ్ దాడికి పాల్పడినటువంటి వ్యక్తికి జిల్లా కోర్టు విధించిన అటువంటి యావజ్జీవ కారాగార శిక్షను అక్కడి హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా  న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినది. యాసిడ్ దాడి కేవలం బాధితురాలిపై మాత్రమే పాల్పడిన నేరం కాదని, అది మొత్తం నాగరిక సమాజం పై  చేసినటువంటి దాడిగా అభివర్ణించింది.

 మహిళలపై దాడులకు అంతులేకుండా పోతోందని విచారం వ్యక్తం చేసింది. మహిళలు చిన్నారులపై దాడులు హేయమైన చర్య అని న్యాయమూర్తి జస్టిస్ శ్రీశానంద్, వీరప్ప  అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల ముఖంపై యాసిడ్ దాడి చేయడం అనేది  వారిని శారీరకంగా పరిచినట్టు అని అది మానసికంగా వేదనకు గురి చేస్తుందని ఆమె తన ముఖాన్ని సమాజానికి చూపించలేక పోతుందని అన్నారు. ఈ యొక్క యాసిడ్ దాడులను  వారి తల్లిదండ్రులు కానీ, భర్త పిల్లలు, ఎవరు కూడా సహించరని, యాసిడ్ దాడికి పాల్పడే నిందితులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని న్యాయస్థానం తెలియజేసింది.

దేవగిరి జిల్లా హునాలైకి చెందిన మహేష్ అనే వ్యక్తి 2014 సంవత్సరంలో బైక్ మీద వచ్చి ఒక ఉపాధ్యాయు రాలైనా  యువతిపై  యాసిడ్ తో దాడి చేశారు. ఈ యొక్క కేసులో సదరు వ్యక్తికి జిల్లా కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష  10 లక్షల రూపాయల జరిమానా విధించింది. సదరు వ్యక్తి హైకోర్టులో అప్పీల్ చేసుకోగా ఆ కోర్టు కూడా  జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పునే ప్రామాణిక పరిచింది.  ప్రతి ఏడాది  దేశంలో యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయని, అలా దాడులు చేసే నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని  న్యాయస్థానం తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: