సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామాందులుగా మారిపోతున్నారు. ఇక విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అన్న సంగతి మరిచి.. కామంతో కళ్లు మూసుకుపోయి రెచ్చిపోతున్నారు. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే ఏపీలో ఓ ఘటన చైతు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఓ ప్రొపెసర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆదివారం సెలవు కావడంతో సాధరణంగా క్యాంపస్ కు ఎవరూ వెళ్లారు.  కాగా.. ఓ ప్రొపెసర్ మాత్రం.. అదే డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ఉద్యోగిణితో.. ఆదివారం అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పని ఉందని తప్పకుండా రావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ప్రొఫెసర్ రమ్మంటే రాను అని చెప్పలేక ఆమె సరే అని చెప్పి క్యాంపస్ కు వెళ్ళింది. అయితే అలా ఒంటరిగా గదిలోకి వచ్చిన ఆ ఉద్యోగిణిపై ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించారు. దాంతో ఆ ఉద్యోగిని ఏడ్చుకుంటూ బయటకి రావడంతో తోటి ఉద్యోగులు ఆమెకు అండగా నిలిచారు. కాగా.. ఆచార్యుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వాయిస్‌ రికార్డును బాధితురాలు ఓ అధ్యాపక సంఘం నాయకుడికి పంపడంతో విషయం బయటికి వచ్చింది.

దేనిపై ఉన్నత ఉద్యోగులు స్పందించారు. ఇక విశ్వవిద్యాలయం ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ కమిటీ సభ్యులు సైతం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలిపారు. అలాగే మరో ఉద్యోగినికి సైతం రాంగ్‌కాల్స్, అసభ్యకర కాల్స్‌ వస్తుండటంతో ఆమె కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక.. మూడు నెలల క్రితం ఓ అధ్యాపకుడు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి సదరు అధ్యాపకుడికి వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అధికారులు ఫిర్యాదులను తీసుకున్నారు. ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: