ఈమధ్య  కాలంలో సాంకేతికత ఎక్కువగా పెరగడం కొన్ని విషయాలలో  మంచి పరిణామాలు జరుగుతున్న, మరికొన్ని విషయాల్లో మాత్రం అనర్థాలే ఎదురవుతున్నాయి. సైబర్ క్రైమ్ మోసగాళ్లు వివిధ రకాలుగా  ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. చివరికి మోసపోయిన ప్రజలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అలాంటి సంఘటనలే ఇప్పుడు చూద్దాం..మార్కెట్ ధర కంటే  తక్కువలో సర్జికల్ గ్లాసెస్ హోల్ సేల్ గా సరఫరా చేస్తామని నమ్మించి మూడు లక్షల పైగా   కాజేసిన కేటుగాళ్లు. సర్జికల్ గ్లాసెస్ కొనుగోలు కోసం ఇటీవల గూగుల్  లో సెర్చ్ చేసిన  మెడికల్ షాప్ యజమాని  విజయ్  కుమార్. వెంటనే ఆయనకు  కాల్ చేసిన  రాజేష్ అమరావతి  అనే వ్యక్తి తాము తక్కువ ధరకు సరఫరా చేస్తామని నమ్మించి  మూడు లక్షల ఇరవై నాలుగు వేలు బ్యాంకుకు ట్రాన్స్ఫర్  చేయించుకున్నాడు.

  డబ్బులు పంపిన  మరుక్షణం నుండి రాజేష్ ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన భాదుతుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఇదే తరహాలో మరో సంఘటనలో సెల్ ఫోన్ వ్యాపారంలో అత్యధిక లాభాలు వస్తున్నాయని నమ్మించి   బేగంబజార్ కు చెందిన  చిరువ్యాపారి గోవిందరామ్ ను ట్రాప్  చేసిన సైబర్ కేటుగాళ్లు మూడున్నర లక్షలు దండుకున్నారు. ముంబై నుండి సెల్ఫోన్   బాక్సులను లాజిస్టిక్స్ ద్వారా పంపిస్తున్నామని  ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని గోవిందరామ్ ను బురిడీ కొట్టించి మూడున్నర లక్షలు కాజేశారు  ఈ కేటుగాళ్లు. మరియు ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం పేరుతో   నిరుద్యోగిని ట్రాప్ చేసిన కిలాడీ లేడీ 2 లక్షల   కాజేసింది.

  ఉద్యోగం కావాలని   ప్రముఖ జాబ్ సైట్లలో  రిజిస్టర్ చేసుకున్న వారసిగూడ  వాసి వానివేశ్వరాన్  విస్తారా ఎయిర్లైన్స్ హెచ్ఆర్ మేనేజర్  అంటూ  వానివేశ్వరాన్ కు కాల్ చేసి   తమ సంస్థలో ఉద్యోగం ఉందని,  రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ సెక్యూరిటీ డిపాజిట్ కింద  రెండు లక్షలు చెల్లించాలని  చెప్పి తన బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్న కిలాడి లేడి తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసింది. ఇలా పలు రకాలుగా  మోసపోయిన బాధితులంతా  సిటీ  సైబర్ క్రైమ్స్ పోలీసులకు   ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: