సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి వారి యొక్క ఫాంహౌస్ కు తీసుకువచ్చి ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన  వ్యక్తులను మహారాష్ట్ర  పోలీసులు  అరెస్ట్ చేశారు.
 మూవీస్ లో  ఛాన్స్ ఇస్తామని చెప్పి  ఒక యువతిని  ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి ఆమెపై  సాహిత్యానికి పాల్పడినా  ఒక నలుగురిని  మహారాష్ట్రకు చెందిన తానే పోలీసులు అరెస్టు చేశారు. లక్నోకు చెందినటువంటి యువతీ 24 సంవత్సరాలు  ఈమెకు సినిమాలో నటించడం అంటే మహా ఇష్టం. ఎప్పుడు సినిమా ఆడిషన్స్ జరిగిన అందులో పాల్గొంటుంది.


కొన్ని రోజుల క్రితం  హిందీ సినిమాకు జరిగినటువంటి ఆడిషన్లో కూడా ఆమె పాల్గొన్నది. ఆ సినిమాలోని ఒక పాత్ర కోసం ఎంపిక కూడా అయింది. ఈ సందర్భంగా  ఆ సినిమా నిర్మిస్తున్న నిర్మాత ఆఫీస్ నుంచి  ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. తానేలో ఉన్న బిబి రోడ్డులో ఉన్నటువంటి నిర్మాత దర్శకులను కలవడానికి రావాలని  ఆమె ఫోన్లో చెప్పారు. అయితే వారు చెప్పినటువంటి ఆఫీసు ప్రదేశంలోకి అమ్మాయి వెళ్ళింది. తను చేరుకున్న ప్రదేశాన్ని కూడా తన తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ లో  ముందుగానే షేర్ చేసి, చేరుకున్నానని తెలియజేసింది. ఆ ప్రదేశం నుంచి వారు  ఆమెను ఒక కారులో ఫాంహౌస్ కు తీసుకొని వెళ్లారు.  ఈ కారులో వెళ్తున్న అంతసేపు  ఆ సినిమా కంపెనీకి  చెందిన కొంతమంది వ్యక్తులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇందుకు ఆమె అభ్యంతరం చెప్పి ఎదురుతిరిగింది అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఆమెకు  ఆయుధాలు చూపిస్తూ, వారి కోరికలు తీర్చాలని అలా చేస్తేనే అవకాశం వస్తుందని వాళ్లు బెదిరించారు.

భయంతో ఆ యువతి  ఏం మాట్లాడకుండా ఫామ్ హౌస్ కు చేరుకున్నది. అక్కడ నుంచి ఆమె తన ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు, మహారాష్ట్రకు చెందిన నవనిర్మాణ సేన, కార్యకర్తలకు  తను ఆపదలో ఉన్నానని  లొకేషన్ షేర్ చేసినది. వెంటనే  స్పందించిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు నిమిషాల సమయంలోనే  ఆ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సినిమా కంపెనీకి చెందిన మహిళతో సహా  నలుగురిని పట్టుకొని   దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో అప్ప చెప్పారు. సదరు యువతి ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకుని  నిందితులపై పలు సెక్షన్ల కింద  కేసులు నమోదు చేశారు. యువతిని బెదిరించి నటువంటి  తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: