చిన్నపిల్లలు  చేసేటటువంటి కొన్ని పనులు ప్రాణాల మీదకు వస్తాయి. ఈ భగత్ సింగ్ నాటకం  ఈ పిల్లాడి ప్రాణాలు తీసింది. భగత్ సింగ్ పాత్రను  ఈ పిల్లాడు పోషించా లనుకొన్నాడు. భగత్ సింగ్ అయితే ఎలా ఉరి తీశారో ఆ విధంగానే  ఇప్పుడు తీసే అటువంటి నాటకాన్ని  వేయడం కోసం  రిహార్సల్ చేస్తున్న సందర్భంలో ఈ 9 ఏళ్ల బాలుడు  ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తోంది. ఈ క్రమంలో స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ యొక్క  పాత్రను ఈ పిల్లాడు  చేయాలను కున్నాడు. భగత్ సింగ్ ను అయితే ఏవిధంగా ఉరితీశారో అలా చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తొమ్మిది సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఈ ఘటనలో తొమ్మిది సంవత్సరాల బాలుడు శివం ప్రాణాలు విడిచాడు. బుధన్ జిల్లాలోని బాబాతు అనే గ్రామంలో  ఆగస్ట్ 15 వ తేదీన  స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ పిల్లాడు  వారి స్కూల్లో  భగత్సింగ్ నాటకం వేయాలని  నిర్ణయించుకున్నాడు. దీంతో స్నేహితులంతా అనుకొని, శివం భగత్సింగ్ నాటకం వేయాలని స్నేహితుల మధ్య నిర్ణయం జరిగినది. అయితే ఈ నాటకం చివరిలో  ఆనాడు భగత్ సింగ్ తన ఉరితాడు ఏ విధంగా అయితే ముద్దు పెట్టుకొని మెడకు వేసుకున్నాడో ఆ సంఘటనను  శివమ్ రిహార్సల్   చేశాడు. దీని కోసం ఒక తాడు ను కూడా తీసుకు వచ్చాడు. శివమ్ ఒక కుర్చీ మీద ఎక్కి  ఆ యొక్క తాడును  ఉరితాడుగా కట్టేసుకొని తన యొక్క మెడకు చుట్టుకున్నడు. అలా చుట్టుకొని  సేమ్ భగత్ సింగ్ లా  ఫోజులు ఇచ్చాడు. ఆ తరువాత ఉరి వేసుకున్నట్టుగా  నటించాలని  అనుకున్నాడు. దీంట్లో భాగంగానే ఆ తాడును మెడకు  కట్టుకున్నాడు. ఇంతలో ఆ ప్రమాదం జరిగింది. ఆయన ఎక్కినటువంటి కుర్చీ నుంచి ఆ ప్రమాదవశాత్తు కాలుజారింది. అంతే ఆయన మెడలో వేసుకున్న తాడు గట్టిగా బిగుసుకుపోయింది . దీంతో శివం  ఊపిరాడక కొట్టుకుంటున్నాడు.

దీన్ని చూసి నటువంటి స్నేహితులు, అది ఆయన యాక్టింగ్ కావొచ్చని వారు నవ్వుతూ ఉన్నారు. నవ్వడమే కాకుండా చప్పట్లు కొడుతూ చాలా బాగా చేస్తున్నావ్ అని ప్రోత్సహించ సాగారు. కొద్ది సమయం అయింది. ఆ బాలుడులో ఎలాంటి కదలికలూ లేవు. పట్టుకొని చూశారు కదలడం లేదు. పిల్లలకు భయం వేసింది. వెంటనే పరుగున వెళ్లి  ఈ ఒక్క విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. శివం ఎంత పిలిచినా లేవడం లేదని అన్నారు. వారంతా పరుగుపరుగున వచ్చి  అది చూసేసరికి  శివం మెడకు ఉరి తాడు బిగుసుకుపోయి మృతి చెంది ఉన్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్న శివం తల్లిదండ్రులు బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: