ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం హత్య ఘటన సంచలనం గా మారిపోయింది.ఆరేళ్ల చిన్నారిపై కనీస మానవత్వం చూపని కామాంధుడు రాజు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారగా  నిందితుడిని  పట్టుకునేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు  ఏకంగా వెయ్యి మంది పోలీసులు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.  అంతే కాదు అతన్ని పట్టుకున్న వారికి పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఏకంగా ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైల్వే పట్టాలపై విగతజీవిగా కనిపించడం సంచలనం గా మారిపోయింది. అయితే పోలీసులు భారీగా గాలిస్తూ ఉండడం కారణంగా రాజు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అందరూ భావిస్తున్నారు.  అయితే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్ని చేతి మీద ఉన్న మౌనిక టాటా ఆధారంగా గుర్తించారు. ఇకపోతే రాజు ఎలా తప్పించుకున్నాడు అనే విషయంపై ప్రస్తుతం పలు సిసి టివి ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన తర్వాత నిందితుడు రాజు మరో నేరం చేసేందుకు కూడా సిద్ధం అయ్యాడట. ఏకంగా ఎల్బీనగర్ లో ఒక ఆటోను దొంగలించి అందులోనే పారిపోవాలని భావించాడట నిందితుడు. ఆటో యజమానికి టీ తాగేందుకు వెళ్లడంతో మొదట ఆటో బ్యాక్ సీట్లో కూర్చున్న రాజు ఆ తర్వాత ఫ్రెంట్ సీట్లోకి వచ్చి ఆటో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు  కాని అంతలోనే ఆటో యజమాని వచ్చి ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించడంతో అతని తో వాగ్వాదానికి దిగాడట రాజు   ఈ క్రమంలోనే దాడి చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడే ఉన్న మిగతా ఆటో డ్రైవర్లు అడ్డుకోవడంతో అక్కడి నుంచి మరో హోటల్ వైపు వెళ్తున్న బస్ ఎక్కాడట   అయితే ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్ ను గుర్తించి  వివరాలు అడగగా అతను నిందితుడు రాజు అనే విషయం తెలియదని లేకపోతే తప్పించుకునే వాడు కాదు అంటూ ఆటోడ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.  గతంలో  కూడా నిందితుడిపై ఒక ఆటో చోరీ కేసు నమోదు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: