ఇటీవలే సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం హత్య చేసిన నిందితుడు రాజుని పట్టుకునేందుకు పోలీసులు ఎంత గాలింపు చర్యలు చేపట్టారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడిన వెయ్యి మంది పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఏకంగా ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. అయితే మరింత తొందరగా ఈ కేసును చేదించేందుకు  ఏకంగా నిందితుడు రాజు సమాచారం అందించిన వారికి పది లక్షల రూపాయల రివార్డును కూడా ఇస్తాము అంటూ తెలంగాణ పోలీసులు ప్రకటించడం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి.



 అయితే చాలా మంది ఇక ఈ రివార్డు ప్రకటన తర్వాత రాజు ఆచూకీ కోసం వెతకడం కూడా ప్రారంభించారు. చివరికి ఇటీవల ఏకంగా రైలు పట్టాలపై నిందితుడు రాజు విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు దొరికి పోతాను అని భావించి చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరు అనుకుంటున్నారు.  ఇదిలా ఉంటే ఇటీవలే నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు ప్రకటించిన పది లక్షల రివార్డు పోలీసులనే తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తోంది  రాజు ఆచూకీ చెప్పాలి అంటూ రివార్డు ప్రకటిస్తూ 2 నెంబర్లను సూచించారు పోలీసులు.



 ఇక ఈ నెంబర్లకు ఎంతో మంది కేటుగాళ్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది..  మీరు రాజు కోసం వెతుకు తున్నారు కదా సార్..  రాజుని నేను ఇప్పుడే చూశాను..  నా పక్కనే ఉన్నాడు.. నాకు 10 లక్షలు ఇస్తారు కదా సార్ అంటూ ఎంతోమంది కేటుగాళ్లు ఫేక్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఏకంగా పోలీసులు సూచించిన నెంబర్ లకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల కాల్స్ వచ్చాయట. మొదట ఇలా వచ్చిన కాల్స్ కి సీరియస్గానే స్పందించిన పోలీసులు ఆ తర్వాత ఇక కాల్స్ ఫేక్ అని భావించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: