కొడుకు పుట్టినప్పుడు కాదు పెరిగి పెద్దయ్ ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో కొడుకు పుట్టినప్పుడు మాత్రమే కాదు అటు పెరిగి పెద్దయిన తర్వాత కూడా  పుత్రోత్సాహం తండ్రికి మిగలనివ్వడం లేదు కొడుకులు. ఆస్తుల కోసం ఎన్నో దారుణాలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. కొడుకు పుట్టాడు అని సంతోషించిన ఆ తండ్రికి ఆ కొడుకులే ఎప్పుడెప్పుడు తల కొరివి పెట్టాలా అని వేచి చూసే ఈ కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా బ్రతికుండగానే తండ్రిని చంపేశారు బ్రతికున్న తండ్రి చనిపోయాడు అంటూ ధ్రువీకరణ పత్రాన్ని కూడా తీసుకున్నారు  తండ్రి పేరు మీద ఉన్న ఆస్తిని వారసత్వంగా తమ పేరు మీదకి మార్చుకోవాలి అని అనుకున్నారు. దీని కోసం ఏకంగా బతికున్న తండ్రి ని చంపేసి నీచానికి ఒడిగట్టారు కొడుకులు. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఒక రోజు ఈ నిజం బయట పడడంతో కొడుకులు చేసిన పని చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. అవుకు మండలం వేములపాడు కు చెందిన తిమ్మయ్య కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆయనకు 5.36 ఎకరాల భూమి ఉంది అయితే మొదటి భార్య కుమారులు ఈ భూమిపై కన్నేశారు. తండ్రిని అడిగితే ఈ భూమి తన పేరుపై రాయడు అని నిర్ణయించుకుని ఏకంగా బతికున్న తండ్రిని చంపేయాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే తండ్రి మరణించినట్లుగా డెత్ సర్టిఫికెట్ కూడా సాధించారు. ఈ క్రమంలోనే ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డెత్ సర్టిఫికెట్ చూపించి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  ఇటీవలే తిమ్మయ్య పొలం తన తాకట్టు పెట్టి బ్యాంకు రుణం పొందడానికి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. ఆస్తికి సంబంధించి తన పేరుకు బదులు కుమారుల పేర్లు వచ్చాయి. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కొడుకులు చేసిన పనికి కన్నీరుమున్నీరయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: