ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది ఎంతో ముఖ్యమైనది. దీనిని సక్రమంగా చేస్తేనే మనకు ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఈ శృంగారం గురించి చాలామంది మాట్లాడాలంటే జంకుతుంటారు. అసలు దీని గురించి సమస్య వచ్చినా చెప్పుకోడానికి ఇబ్బందులు పడి కనీసం దాని ప్రస్తావన కూడా తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు.  సాధారణంగా  లైంగిక  ఆరోగ్య సమాచారం గురించి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడరు. ఏదైనా  శృగారం సమస్య ఎదురైతే తప్ప డాక్టర్ల దగ్గరికి  వెళ్లడానికి కూడా విముఖత చూపుతారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో  శృంగార సమస్యల ప్రస్తావన కరువైందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా కరోణ వైరస్ నేపథ్యంలో శృంగారం గురించి ఎక్కువగా ప్రచారంలో ఉన్న  తప్పుడు సమాచారాన్ని తెలియపరుస్తూ, దానికి సరైన సమాచారం అందిస్తున్నారు ప్రముఖ సెక్సలజీ  డాక్టర్ సనర్ష్.. కరోణ వైరస్ నేపథ్యంలో సురక్షితమైన శృంగారంలో పాల్గొనడానికి  అనుసరించాల్సిన మార్గాలు. శృంగారానికి ముందే  దంపతులిద్దరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. మీకు కరోనా వైరస్ కు సంబంధించిన ఏవైనా లక్షణాలు ఉన్నాయో పరీక్షించుకోవాలి. కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలి. దీని తర్వాత బయట ప్రదేశాల్లో తిరగకుండా దంపతులిద్దరూ ఇంటిదగ్గర ఉన్నట్లయితే లైంగికంగా కలవచ్చు. కరోణ వైరస్ మనకు లేకుంటే చాలా సులభంగా శృంగారంలో పాల్గొని ఆనందించ వచ్చని డాక్టర్ జైన్ తెలిపారు.

 శృంగారం తో కరోణ వైరస్ వస్తుందా..?
 లైంగికంగా కలవడం ద్వారా కరోణ వైరస్ అనేది సంక్రమించదు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు అయితే వీర్యం ద్వారా వజైనల్ ఫ్లూయిడ్ లో వైరస్ ఉన్నట్టు  ఇప్పటివరకు లేదు. అయితే ఈ టీకా  మనం తీసుకోకపోయినా పార్ట్నర్ టీకా తీసుకుందా లేదా మనకు తెలియకపోయినా  లైంగికంగా కలవద్దు. కరోణ వైరస్ అనేది శ్లేష్మం మరియు లాలాజలం ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోణ వైరస్ ఉన్నటువంటి మన భాగస్వామి దగ్గరికి వెళ్తే  వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా కౌగిలింతలు, ముద్దులు లాంటివి చేస్తే వైరస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
 
పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి..?
 కరోణ సమయంలో కూడా  లైంగికంగా కలవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి మీరు విముక్తి పొందుతారు. అదేమిటంటే మీరు ముద్దులు, అలాగే సెక్స్ చేయకుండా  రొమాంటిక్ ఫోర్ ప్లే ద్వారా అనుభూతి పొందవచ్చు. నీతో ఎప్పుడూ ఉండే మీ భాగస్వామితో లైంగికంగా కలిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ మీ పార్ట్నర్ అనారోగ్యంగా ఉన్నట్లయితే ఎలాంటి కారణాలు లక్షణాలు కనిపించిన 14 రోజులపాటు వారిని క్వారంటైన్ లో ఉంచడం చాలా మంచిది. దీని అర్థం ఏమిటంటే ఈ సమయంలో వారితో ఏ విధంగా కూడా కలవడం మంచిది కాదు. సెక్స్ చేసిన తర్వాత వ్యక్తిగత మైనటువంటి శరీర భాగాలను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కరోణ వైరస్ వాటి ఉపరితలాలపై గంటలకొద్దీ జీవించి ఉంటుంది. అయితే మనం సెక్స్ లో పాల్గొనే ముందు చేతులు, కాళ్లు, ప్రతి ఒక్క భాగాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే ముద్దుల నివారించాలంటే, ఇతరాత్ర స్రవాలను తాకకుండా ఉండడం కోసం  ఫేస్ మాస్కులు, గ్లోవ్స్, కండోమ్లను ఎక్కువగా ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: