స‌మాజంలో నానాటికి వివాహాల‌కు విలువ లేకుండా పోతుంది. భార‌త దేశం సంస్కృతి సాంప్ర‌దాయాల్లో వైవాహిక బంధానికి చాలా ప్రాధాన్య‌త ఉంది. పెళ్లంటే అనాధిక వ‌స్తున్న ఆచారం మాత్ర‌మే కాదు.. రెండు మ‌నుషుల జీవితానికి మార్గం రెండు హృద‌యాల క‌ల‌యిక‌కు నిద‌ర్శనం. కానీ అలాంటి ప‌విత్రంగా భావించే క‌ళ్యాణానికి రానురాను మ‌ర‌క ఏర్ప‌డుతోంది. పెళ్ల‌యిన కొన్ని నిమిషాల‌కే, కాళ్ల‌కు పారాణి ఆర‌క‌ముందే ఏడు అడుగులు న‌డిచిన జీవిత‌భాగ‌స్వామిని పందిట్లోనే వ‌దిలి వెళ్లిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి.. క‌నిపిస్తున్నాయి.


   క‌ళ్యాణం జ‌రిగి కాస్త స‌మ‌యం గ‌డ‌వ‌కముందే త‌మ ప్రియుడితో వ‌ధువు పారిపోయిన సంఘ‌ట‌న‌లు కొన్ని అయితే, పెళ్లి జ‌రిగిన రెండు మూడు రోజుల‌కు త‌ట్టా బుట్ట స‌ర్దుకుని త‌మ‌కు ఇష్ట‌మ‌యిన వారితో పారిపోయిన దారుణాలు కోకొల్ల‌లు.. అలాంటి సంఘ‌ట‌న మ‌రొకటి వెలుగులోకి వ‌చ్చింది. పెళ్లి జ‌రిగి అర‌గంట కాకముందే.. వ‌ధువు క‌నిపించకుండా పోయింది. బ్యూటీ పార్ల‌ర్ వెళ్తాన‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వెళ్లింది ఆమే.. వెళ్లింది కానీ పెళ్లి కూతురు ఎంత‌కూ తిరిగి రాక‌పోవ‌డంతో.. రెండు కుటుంబాలు కంగారు ప‌డ్డారు. అస‌లు పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.


  పెళ్లి అయిన అరగంటలోనే పెళ్లి కూతురు క‌నిపించ‌కుండా పోయిన సంఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జ‌రిగింది. హైదరాబాద్‌ పాతనగరానికి చెందిన ఓ యువతితో బెంగళూరుకు చెందిన వ్యక్తి తో పెళ్లి చేశారు.  శుక్రవారం రాత్రి నబీల్‌ కాలనీలో వివాహం ఘనంగా చేశారు.  అయితే.. అబ్బాయి తరఫున యువతికి దాదాపు రూ.2 లక్షల విలువైన బంగారం, రూ.50వేల నగదును లాంచ‌నంగా పెట్టారు.  వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని పట్టుబట్టింది. దీనికి ఒప్పుకున్న ఇరుకుటుంబ స‌భ్యులు స‌రే అని ఆమెను పంపించారు.


బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన అనంతరం వధువు ఎంతసేపటికీ తిరిగి రాలేదు. దీంతో వ‌రుడు తరఫున‌ వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే.. ఆ యువ‌తి తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయిఉంటుందని పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని బాలాపూర్‌ పోలీసులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: