రాష్ట్రంలో చిన్నారుల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఓ ఏడేళ్ల మైన‌ర్ బాలిక‌ను అప‌హ‌రించారు ఇద్ద‌రు యువ‌కులు. వినాయ‌క విగ్ర‌హాలు చూపిస్తామంటూ ఆ చిన్నారిని తీసుకెళ్లున్న మార్గ‌మ‌ధ్యంలో స్థానికులు అడ్డుకోగా పెద్ద ఘోరం త‌ప్పింది. నిందితుల‌ను ప‌ట్టుకుని దేహ‌శుద్ది చేసి బాలిక‌ను త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ హోట‌ల్‌లో ఇద్ద‌రు దంప‌తులు ప‌ని చేస్తున్నారు. వీరికి పదేళ్ల వ‌య‌స్సున్న కూతురు ఉంది. అదే హోట‌ల్ లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు యువ‌కులు ఆ బాలిక‌ను కిడ్నాప్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వినాయ‌క విగ్రహాలు చూపిస్తామ‌ని సంగారెడ్డి శివారులో ఉన్న మ‌హ‌బూబ్‌సాగ‌ర్ చెరువు వ‌ద్ద‌కు ఆ బాలిక‌ను తీసుకువెళ్లారు ఆ ఇద్ద‌రు యువ‌కులు.


    అక్క‌డ కాసేపు వినాయ‌క నిమ‌జ్జ‌నాన్ని చూశారు. త‌రువాత చౌటకూర్ మండ‌లం శివ్వంపేట మంజీర వంతెన వ‌ద్ద చాలా విగ్రహాలు ఉంటాయిని బాలిక‌ను న‌మ్మించి అక్క‌డ‌కు తీసుకువెళ్తున్నారు. ఈ క్ర‌మంలో శివ్వంపేట‌లో మార్గ‌మ‌ధ్య‌లో ఉన్న క‌ల్లు దుకాణం ద‌గ్గ‌ర ఆగారు.  ఆ ఇద్ద‌రు యువ‌కుల్లో ఒక‌డు క‌ల్లు దుకాణం లోప‌లికి వెళ్లారు. అప్ప‌టికే చీక‌టి ప‌డ‌డంతో బాలిక భ‌య‌ప‌డుతూ ఏడుస్తూ నిల‌బ‌డింది. బాలిక‌ను చూసిన స్థానికులు బాలిక ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏమైంద‌ని వివ‌రాలు అడిగారు.


 దీంతో కాళ్లు మొక్కుతా అని ఇంటికి తీసుకెళ్లండ‌ని ఎంత భ్ర‌తిమిలాడినా తీసుకు వెళ్ల‌డం లేద‌ని చెప్పింది. వారు వెంట‌నే బాలిక త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి చెప్పారు. ఆ త‌రువాత నిందితుల‌ను ప‌ట్టుకొని దేహ‌శుద్ది చేశారు. అనంత‌రం పుల్క‌ల్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం బాలిక‌ను క్షేమంగా త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌జెప్పారు. అలాగే ఇద్ద‌రు యువ‌కుల‌పై  కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ విష‌య‌మై డీఎస్పీ బాలాజీ మాట్లాడారు.


 శివ్వంపేటలో కల్లు దుకాణం వద్ద ఆగారు. నిందితుల్లో ఒకడు కల్లు దుకాణంలోకి వెళ్లాడు. అప్పటికే చీకటి పడటంతో ఆందోళన చెందిన బాలిక ఏడుస్తూ నిల్చుంది. శివ్వంపేటకు చెందిన స్థానికులు గమనించి బాలికను వివరాలు అడిగారు. గజగజ వణుకుతూ.. కాళ్లు మొక్కుతానని ప్రాధేయపడినా తనను ఇంటికి తీసుకెళ్లడం లేదని రోదిస్తూ వారికి తెలిపింది. వారు వెంటనే అప్రమత్తమై బాలిక తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు.


ఇద్దరు నిందితులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పుల్కల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి పోలీసులకు, బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాలికను వెంట తీసుకెళ్లినందుకు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ బాలాజీ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: