తాబేలు - గగన విహారి
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కూర్మనాథుడు. శ్రీకూర్మం ఆలయానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో విచ్చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ వాసులకే కాక దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు విచ్చేస్తారు. మహావిష్ణువు దశావతారాలలో కూర్మావతారం కూడ ఒకటి. కూర్మం అంటే తాబేలు. చాలా మంది ఇళ్లలో తాబేలు రూపాల్ని ఉంచుకోవడం సెంటి మెంట్.
అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలో తాబేళ్లు కూడా ఉండడం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలో   ప్రభుత్వాలు తాబెళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.    ఆంధ్ర లో నెల్లూరు , విశాఖ జిల్లా తీరప్రాంతాలలో ఆలివర్ రెడ్లీ తాబేళ్లను ప్రభత్వ అధికారులు పెంచి వాటిని సముద్రంలోకి  వదులుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం  అంతరిరంచి పోతున్న జీవజాతుల పరిరక్షణకు ప్రత్యేక కార్యచరణ ను రూపొంందించి అమల చేస్తోంది.
ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కొన్ని జీవజాతులు అంతరించి పోతున్నాయి. వాటిల్లో తాబేళ్లు కూడా ఉన్నాయి. తాబేళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువగా అక్రమ రవాణాకు గురువుతున్నాయి. అధికారులు ఎంత ప్రయత్నించినా అక్రమ రవాణాదారులు ఏదో రకరంగా తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. తాము పట్టుకున్న తాబేళ్లను అధికారులు జంతు ప్రదర్శన శాలలకు అందజేస్తున్నారు. కానీ సహజ ఆవాసాల్లోనే తాబేళ్ల జీవనం మరింత సమర్దవంతంగా ఉం టాయి. దీనిని గమనించిన తెలంగాణ అటవీ శాఖ తమ వద్ద ఉన్న అరుదైన తాబేళ్ల ఇండియనా రూటెట్ టర్టిల్, ఇండియన్ టెంట్ టర్టిల్ లను వాటి సహజ ఆవాస  ప్రాంతాలైన నర్మదా నదీ తీరానికి పంపించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈ అరుదైన తాబేళ్లు లక్నోకు పంపించారు.దీంతో తాబేళ్లు గగన విహారులయ్యాయి.
హైదరాబాద్ లో అక్రమంగా తాబేళ్లను అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తుల ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు వందలకు పైగా అరుదైన తాబేశ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాటిని అటవీ శాఖ అధికారులకు అందజేశారు. వారు ఈ తాబేళ్లను జూ పార్కుకు తరలించారు. వీటిని వాటి సహజ సిద్ధ ఆవాస కేంద్ర నర్మదా నదీ తీరానికి తలించే నిమిత్తం తెలంగా ణ అటవీ శాఖ, లక్నోలోని అటవీ శాఖ అధికాలను సంప్రదించారు. వారి హైదరాబాద్ జూ పార్కుకు వచ్చి తాబేళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏ లాంటి  వ్యాధులు లేవని నిర్ధారించుకున్నాక వాటిని  ప్యాక్ చేసి విమానంలో లక్నోకు  తరలించారు. అక్కడ కూడా వాటికి మరలా పరీక్షలు నిర్వహించి నర్మదా నదిలోకి వదులు తామని ఉత్తర ప్రదేశ్ అటవీ శాఖ అధికారులు తెలిపారు.   దీంతో  జలచర జీవి  కాస్తా గగన విహారి  అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

air