ఒకప్పుడు ఏవైనా ఆర్థిక లావాదేవీలు చేయాలి అంటే బ్యాంకుకు పరుగులు పెట్టే వారు ప్రతి ఒక్కరు. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి ఆర్థిక లావాదేవీలు జరిపే వారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి టెక్నాలజీ పెరిగింది ఆర్థిక లావాదేవీలు జరగాలి అంటే ఎక్కడో ఉన్న బ్యాంకు కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరొక బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి.  ఇలా రోజురోజుకీ జనాలు కూడా అప్డేట్ అవుతున్నారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఎంతో నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.



 ఇలా ఎన్నో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ద్వారానే ప్రస్తుతం అందరూ ఆర్థికపరమైన లావాదేవీలు జరుపుతున్నారు అనే విషయం తెలిసిందే  అయితే ఇలా రోజురోజుకు ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో అటు సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి.  చెరువులో వల వేసి చేపలు ఎప్పుడు చిక్కుతాయి అని వేచి చూసినట్లుగా.. ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్ లను ఆన్లైన్లో ఉంచి ఎప్పుడు ఆ నెంబర్కి జనాలు ఫోన్ చేస్తారా అని వేచి చూస్తున్నారు సైబర్ నేరగాల్లు.  ఇలా ఎవరైనా గూగుల్లో వెతికి కస్టమర్ కేర్ నెంబర్ కి ఫోన్ చేయగానే వారిని మాటల్లో దింపి చివరికి ఖాతా ఖాళీ చేస్తున్నారు.




 దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  500 కోసం కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే ఏడు వేల ఒక వంద రూపాయలు మాయం అయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. పరికి బండ గ్రామానికి చెందిన సురేష్ తన స్నేహితుడు వెంకట బ్రహ్మయ్య బ్యాంకు ఖాతాలోకి ₹500 గూగుల్ పే ద్వారా పంపించాడు. అయితే ఈ డబ్బులు అకౌంట్ లో నుంచి డెబిట్ అయ్యాయి. కానీ వెంకట బ్రహ్మయ్య కు మాత్రం వెళ్లలేదు. దీంతో గూగుల్లో వెతికి కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేశాడు సురేష్. ఇక కేటుగాళ్లు అతని మాయలో దింపి ఏకంగా ఖాతాలో ఉన్న ఏడు వేల ఒక వంద రూపాయలు మాయం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: