ప‌ని ఉంద‌ని పిలిచి 19 ఏళ్ల సెక్ర‌ట‌రిపై హ‌త్యాచారం చేశాడు బాస్‌.. త‌రువాత పోలీసుల‌కు చెబ‌తాన‌న‌డంతో 10వ అంత‌స్తు నుంచి కిందకి తోసేశాడు. దీంతో ఆ యువ‌తి మ‌రణించింది. ఈ దారుణం ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. త‌న ద‌గ్గ‌ర పని చేసే 19 ఏళ్ల ఉద్యోగినిపై క‌న్నేశాడు 40 ఏళ్ల బాస్‌. కాన్పూర్‌లో ప్ర‌తీక్ వైశ్ అనే వ్య‌క్తి  డెయిరీ నడుపుతున్నాడు. ఎలాగైన ఆ యువ‌తిని లొంగ‌దీసుకోవాల‌నుకున్నాడు.  


దీంతో ఓ రోజు క‌ల్యాణ్‌పూర్‌లో ఉంటున్న త‌న ఫ్లాట్‌కు ర‌మ్మ‌న్నాడు ప్ర‌తీక్ వైశ్‌.  ఇందుకు ఆమె భ‌య‌ప‌డినా వెళ్లాల్సి వ‌చ్చింది.  భ‌య‌ప‌డుతూనే య‌జ‌మాని ఉంటున్న గుల్మొహ‌ర్ అపార్ట్‌మెంట్‌లో ని 10 వ ఫ్లాట్‌కు వెళ్లింది ఆ యువ‌తి.  ఇంటికి వ‌చ్చిన యువ‌తిని బ‌ల‌వంతం చేయ‌బోయాడు ప్ర‌తీక్‌.. ఆమె దానికి ఒప్పుకోక‌పోవ‌డంతో.. డ‌బ్బులు కూడా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ ఆమెను బ‌తిమాలాడు.


నాకు ఇలాంటివి ఇష్టం ఉండ‌దు.. న‌న్ను వ‌దిలేయండంటూ ప్రాధేయ‌ప‌డింది. కాళ్లు ప‌ట్టుకుని వేడుకుంది. మీరు నాకు తండ్రి లాంటి వారు నేను మీ కూతురు లాంటి దాన్ని అని ఏడుస్తూ బ‌తిమిలాడింది. అయినా అత‌డు విన‌లేదు. కామంతో క‌ళ్లు మూసుకుపోయి కోరిక తీర్చుకోవాల‌నుకున్నాడు. త‌న‌తో శారీరక సంబంధ పెట్టుకోవాల‌ని ఎంత ఒత్తిడి చేసినా.. ప్ర‌లోభాల‌కు గురి చేసినా యువ‌తి విన‌క‌పోవ‌డంతో బ‌ల‌వంతం చేశాడు. అత‌డి ప‌శు బ‌లం ముందు యువ‌తి లేడి కూన‌లా అల్లాడిపోయింది.


 త‌రువాత ఏడుస్తూ.. పోలీసుల‌కు చెబుతాన‌న‌డంతో భ‌యంతో ప్ర‌తీక్ అమ్మాయిని ఈడ్చుకెళ్లి తాను ఉన్న 10 అంత‌స్తు పై నుంచి కింద‌కు తోసేశాడు. దీంతో అక్క‌డికక్క‌డే యువ‌తి మ‌ర‌ణించింది. ఏమీ తెలియ‌న‌ట్లుగా  ప్ర‌మాదం జ‌రిగి చ‌నిపోయిన‌ట్టు క‌థ అల్లేందుకు ప్ర‌య‌త్నించాడు ప్ర‌తీక్.  పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వాళ్ల తీరులో ప్ర‌శ్నించగా నిజం ఒప్పుకున్నాడు ప్ర‌తీక్. దీంతో ఆ కామందుడిని పోలీసులు అరెస్టు చేసి క‌స్ట‌డీకీ త‌ర‌లించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: