ఒక దొంగ సైకిళ్ల‌ను దొంగ‌లించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. త‌న కంటి ఎక్క‌డైనా ఖ‌రీదైన సైకిళ్ క‌నిపిస్తే చాలు. రాత్రి వ‌ర‌కు అది మాయం. వాటి కోసం ప్ర‌త్యేకంగా రెక్కి కూడా నిర్వ‌హిస్తాడు. మంచి సమ‌యం చూసి రంగం లోకి దిగుతాడు. ఎవ‌రి కంట ప‌డ‌కుంటా సైకిళ్ల ను అల‌వ‌క దొంగ‌లిస్తాడు. అలా ఎకంగా 45 ఖ‌రిదైనా సైకిళ్ల ను దొంగ లించాడు. వీటి విలువ దాదాపు రూ. 10 ల‌క్ష‌ల కు పైగా ఉంటుంద‌ని అంచనా. రోజు రోజు కు సైకిళ్లు మాయం అవుతున్నాయి. కానీ ఎవ‌రు దొంగత‌నం చేస్తున్నారో తెలియ‌దు. ఈ వ్య‌వ‌హారం పోలీసులకు పెద్ద త‌ల నొప్పి గా మారింది. ఈ దొంగ ను ఎలాగైనా ప‌ట్టు కోవాల‌ని పోలీసులు చాలా ప్ర‌య‌త్నించారు. కానీ ఈ దొంగ చాలా కాలం నుంచి పోలీసుల నుంచి త‌ప్పించు కుని తిరుగుతున్నాడు.




ఈ వ్య‌వ‌హారం మ‌న దేశంలోనే జ‌రిగింది. క‌ర్ణాట‌క రాష్ట్రం లోని బెంగ‌ళూర్ న‌గ‌రంలో  ఇది జరిగింది. అయితే ఈ న‌గ‌రంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఖ‌రీదైన సైకిళ్లు మాయం అవుతున్నాయి. ఈ కేసు బెంగ‌ళూర్ న‌గ‌ర పోలీసుల‌కు పెద్ద స‌వాల్ గా మారింది. చివ‌రికి ఈ దొంగ ను ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు ఒక ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. దాదాపు 50 మంది పై పోలీసులు నిఘా పెట్టారు. చివ‌రికి సెప్టెంబ‌ర్ 22న సైకిల్ దొంగ ను అత‌నికి స‌హ‌క‌రిస్తున్న అత‌ని స్నేహితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగ 45 సైకిళ్ల ను దొంగ లించాడ‌ని పోలీసులు నిర్ధారించారు. వీటి విలువ రూ. 10 ల‌క్ష ల‌కు పైగా నే ఉంటుంద‌ని పోలీసులు అంచనా వేశారు. ప్ర‌స్తుతం వీరి నుంచి 19 సైకిళ్ల ను ప‌ట్టుకున్నారు. మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు.




దొంగ సైకిళ్ల ను ఎలా దొంగ త‌నం చేశాడో పోలీసులు వివ‌రించారు. ఈ దొంగ మ‌రియు అత‌ని స్నేహితుడు ఇద్దరు క‌లిసి దొంగ త‌నాలు చేసేవార‌ట‌. ఇద్ద‌రు క‌లిసి సాయంత్రం స‌మ‌యంలో బెంగ‌ళూర్ న‌గరంలోని సంజ‌య్ న‌గ‌ర్ హెబ్బ‌ల్, మ‌రాథా హ‌ళ్లి నందిని లే అవుట్ వంటి ప్రాంత‌ల‌లో సైకిళ్ల వేట కు వేళ్లే వార‌ట‌. అక్క‌డ చూసిన సైకిళ్ల ను రాత్రి వేళ‌లో దొంగ త‌నం చేసేవార‌ట‌. ఆ సైకిళ్ల ను మ‌రో మిత్రుని స‌హాయంతో బ‌య‌ట అమ్మేసే వార‌ని పోలీసులు చెప్పారు. ఈ దొంగ ఎవ‌రి వ‌ద్ద నుంచి సైకిళ్ల ను దొంగ‌లించాడో వారి గురించి సెర్చ్ చేస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు.




మరింత సమాచారం తెలుసుకోండి: