ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి. అమెరికా కేంద్రంగా దాదాపు ప్రతి దేశంలో విస్తరించిన అమ్నెస్టీ ఇండియా ఎక్కడుంది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఏం చేస్తుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎందుకు స్పందించడం లేదు. సివిల్ రైట్స్ డిఫెండర్స్  ఎందుకు ఖండించడం లేదు? ఆఫ్గన్ లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు నెల తిరక్కుండానే తమ రాక్షస ప్రవృత్తి కి శ్రీకారం చుట్టారు. అనాగరిక శిక్షల విధింపు ను ప్రారంభించారు. 24 గంటల ముందే తాము తిరిగి 20 ఏళ్ల క్రితం నాటి పాలనను రుచిచూపిస్తామని ప్రకటించిన తాలిబన్లు  ఆఫ్గన్ లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన నలుగురిని కాళ్లు చేతులు నరికి రక్తస్రావం అవుతుండగా క్రేన్ లకు కట్టి బహిరంగంగా ఉరి తీసి ఆ మృతదేహాన్ని నగరాల్లో తిప్పుతూ  బహిరంగంగా ప్రదర్శిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు.

చిన్నచిన్న నేరాలకు కూడా అత్యంత కఠినమైన శిక్షలు తప్పదని మరోసారి హెచ్చరించారు. కాళ్లు చేతులు నరికేస్తాం.. పీకలు కోసేస్తాం.. బహిరంగంగా ఉరి తీస్తాం.. మూకుమ్మడిగా చంపేస్తాం.. అంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి అంతర్జాతీయ సమాజం ముందు ఏకరువు పెట్టాడు. అయినప్పటికీ సభ్యసమాజం ఏం చేస్తుంది. ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు. ఓవైపు న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాలకులు నాయకుడు అక్కడ కొలువుదీరారు. ప్రపంచ గమనాన్ని నిర్దేశించే పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. వివిధ దేశాల వ్యక్తిగత అంశాల్లో కూడా చొరబడుతున్నారు.

 పలు ప్రభుత్వాల మంచి చెడ్డల్ని ఎత్తు చూపిస్తున్నారు. కానీ ఆఫ్గన్లో మొదలైన అమానుష దారుణం మారణకాండపై అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో కూడిన ఐక్యరాజ్యసమితి ఎందుకు స్పందించడం లేదు? ప్రపంచవ్యాప్తంగా ఉరిశిక్ష రద్దుకు  ఉద్యమాలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఈ శిక్షను రద్దు చేశాయి. మరికొన్ని దేశాలు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక నేరాలకు సంబంధించి ఇది అమలు చేస్తున్నాయి. అది కూడా రహస్యంగా తెల్లవారుజామున అతి పెద్ద జైలు ఆవరణలో కేవలం నలుగురు ఐదుగురు అధికారుల సమక్షంలో శిక్షలు అమలు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: