కూకట్ పల్లి  సుధారాణి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుధారాణిని  ప్రేమించినట్టు నటించి, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొన్న సైకో కిరణ్ ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు. తన తండ్రితో సుధారాణికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన సైకో దారుణంగా చంపేశాడు. బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లయిన 28 రోజులకే భార్యను అతి కిరాతకంగా సైకో కిరణ్ చంపేశాడు. అయితే కిరణ్ సుధారాణిని ఎందుకు చంపాడు..? దేనికోసం చంపాడు..? అసలు అనుమానం ఏంటి..? ఎందుకోసం ఈ అనుమానం రావాల్సి వచ్చింది. సుధారాణిని  చంపడానికి ముందు అసలేం జరిగింది. 26 సంవత్సరాల సుధారాణిది ఖమ్మం జిల్లా దేవునిపల్లి టౌన్. ఆమె తండ్రి గంగారాం.

కిరణ్ మరియు సుధారాణి కి 27 ఆగస్టున పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కామారెడ్డి లో ఉన్నారు. 4, 5 రోజుల కిందటి నుంచి  బాచుపల్లిలోని వారి సొంత ప్లాట్లో ఉంటున్నారు. కిరణ్ కుమార్ యొక్క తండ్రి కూడా వచ్చి మూడు రోజులు ఉండి తరువాత వెళ్ళిపోయాడు. మర్నాడే గంగారం మరియు అతని భార్య సుధారాణి దగ్గరికి వచ్చారు.

 మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్ కి  వచ్చారు. వాళ్లు కాల్ వచ్చినప్పుడు డోర్ తీయకుండా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడంవల్ల వాళ్ళకి అనుమానం వచ్చి కిరణ్ కుమార్ వాళ్ళ బావని పిలిచి తలుపు తీశారు. తలుపు తీసి చూసే సరికి సుధారాణి రక్తపు మడుగుల్లో పడి ఉన్నది. ఈమె మర్డర్ లో ఉపయోగించిన బ్లేడు ఆన్లైన్ లో బుక్ చేసినదిగా తెలిసింది.. దీని ద్వారా సుధారాణి హత్య చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు తెలిపారు. ఈమెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే డం కోసం  కిరణ్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈమెను  చంపడం కోసమే కిరణ్ కుమార్ హైదరాబాద్ వచ్చాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: