IHGIHG


పెళ్లి చేసుకున్న భార్యను ఆమె ఆస్తికోసం రెండు సార్లు పామును ఉసిగొల్పి హతమార్చాడు ఓ కసాయి భర్త. కేరళ రాష్ట్రం లోని కొల్లం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్య తదనంతరం కొద్దీ రోజులకే ఆమె ఆస్తికోసం భర్త ప్రయత్నించగా మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం రావడం తో అతనిమీద పోలీస్ కేసుపెట్టారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు అసలువిషయం విని కంగుతిన్నారు. కొల్లం జిల్లాలోని ఆంచల్ అనే  గ్రామానికి చెంది ఉత్ర అనే యువతితో పత్తినంథిట్ట జిల్లా లోని ఆడూర్‌కు చెందిన సూరజ్‌ అనే యువకుడితో పెళ్ళిజరిగింది. చూడటానికి చూడ ముచ్చటైన జంట అని అంత సంతోష పడ్డారు పెద్దలు. కానీ ఆ సంతోషం మూడు నాళ్ళ ముచ్చటైంది. 
IHGఉత్ర ని పెళ్లి చేసుకొనే సమయంలో భారీ గా కట్నాన్ని పుచుకున్నాడు సూరజ్. అయితే ఉత్ర పేరుమీద బ్యాంకు బ్యాలన్స్, నగలు , స్థిరాస్థి ఇలా చాల నే ఉన్నాయ్. ఆమె ఆస్తి పై కన్నేసిన సూరజ్ ఆమె ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా కార్య చరణను అమలుచేయడానికి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు. రోజూ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూస్తూ భార్యని ఎలా చంపితే కేసు తనపైకి రాదో ఆ విధమైన కంటెంట్ ని చూసేవాడు . మే 7 ,2020  లాక్ డౌన్ సమయంలో ఉత్ర ని చంపడానికి పాముని ప్రయోగించాడు. అదే సమయంలో మత్తు మందుని కూడా ఆమెకు ఇచ్చాడు . సరైన సమయంలో ఆమె తల్లితండ్రులు తెలుసుకోవడం తో ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు.
IHG
 52 రోజులు   మృత్యువుతో పోరాడి ఆమె బ్రతికింది. కానీ సూరజ్ ప్లాన్ ఫలించక పోవడంతో మల్లి ఆమె పై పామును ప్రయోగించాడు . ఈసారి మాత్రం సూరజ్ విజయం సాధించాడు ...పాపం ఉత్ర ఈ సారి పాముకాటుకు బలైంది. దీనికి కారణం సూరజ్ ఆమెను కాపాడడం లో జాప్యం చేయడమే. ఈ కేసు విషయమై పోలీసులు 100 పేజీల ఛార్జ్ షీట్ ని ప్రిపేర్ చేసి కొల్లం అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయస్థానం లో ప్రొడ్యూస్ చేశారు.

IHG

 కొల్లం  ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.మోహన్‌రాజ్ నిందితుడికి యావజీవ కారాగార శిక్ష విధించాలని కోరారు. అన్ని పూర్వా పరాలను పరిశీలించిన కొల్లాం అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ఎం మనోజ్‌ సూరజ్ కు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. సూరజ్ కి 28 సంవత్సరాలే కావడంతో అతడి కి మరణ శిక్ష విధించకుండా యావజ్జీవ కారాగార  శిక్షను అమలు చేయాల్సిందిగా తీర్పు నిచ్చారు. అదనంగా అతడిపై ఉన్న రెండు కేసులకు గాను ఒక కేసు కొరకు ఐదు సంవత్సరాలు మరో కేసుకొరకు ఏడు ఏళ్ళు శిక్ష మరియు ఐదు లక్షలు జరిమానా విధించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: