ఇండియన్ ఎయిర్ ఫోర్స్  లో జాబ్ సంపాదించాడు ఆ యువకుడు కానీ ఒక మహిళకు బయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ ఘటన జైపూర్‌ నగరం  హౌసింగ్ బోర్డ్ కాలనీ శాస్త్రినగర్‌ ప్రాంతానికి చెందిన యువకుడు సునిల్ కుమార్ మాథుర్‌  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెలెక్ట్ అయ్యాడు. కొడుక్కి జాబ్ దొరికిందని అందరు తెగ సంబరపడి పోయారు. పోలీస్ వెరిఫికేషన్ కోసం వస్తారని తెలిసిన సునీల్ కుమార్ అతని మేనత్త కారణంగా ఎవరూలేని సమయంలో తన గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడు. విషయం తెలుసుకున్న అతని తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది అందుకు కారణం తన భర్త చెల్లెలు అని చెప్పింది. అసలు విషయం ఏమిటంటే సునీల్ కుమార్ మాథుర్ యొక్క నాన్న వాళ్ళ తండ్రిని అతని మేనత్త పోషించే సమయంలో ఆస్తికి సంబందించిన పత్రాలపై సంత కాలు  ఆమె తండ్రినుండి పొందింది .

 ఆమె తండ్రి చనిపోయాక తన తండ్రికి సంబందించిన బ్యాంకు లో   గల ప్రతి ఆభరణం, డబ్బు ను స్వాధీనం చేసుకుంది అయితే ఈ విషయమై సునీల్ కుమార్ మాథుర్ కి అతని మేనత్త ల మధ్య పరస్పరం గొడవలు జరిగేవి. అదేవిధంగా ఆస్తివిషయం   లో అతని పై కేసుకూడా పెట్టింది. పోలీసులు వెరిఫికేషన్ కి వస్తారని తెలిసిన  సునీల్ కుమార్ బాధపడేవాడని అతని తల్లి . తనలో తాను మదనపడే వాడని తెలిపింది. ఆ కారణం చేతనే తనకు జాబ్ రాదని ఫిక్స్ అయ్యి మంగళవారం తెల్లవారు జామున తన గదిలో ఉరి వేసుకొని చని పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. అయితే పొలిసు విచారణ ఉండగా  అతడు అలాచేయడం సరికాదని అతడిది తొందరపాటు నిర్ణయం అని  అందరూ అంటున్నారు. ఆ జాబ్ రాకపోతే వేరొక జాబ్ ఈలాంటి చిన్నవిషయం కోసం తన్ను తాను బలితీసుకోవడం అర్థం లేని పని. అతని మరణానికి కారణం ఐన అతని మేనత్తను తప్పక మందలించి శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: