ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తిలో అర్థ‌రాత్రి ఘోరం జ‌రిగింది. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా గంట‌పాటు భారీ వ‌ర్షం కురిసింది. భారీ వ‌ర్షానికి వెస్ట్ చర్చీ బ్రిడ్జ్ నీట మునిగింది. అదేవిధంగా క‌ర్నాట‌క‌కు చెందిన ఏడుగురు భ‌క్తులు నీటిలో చిక్కుకున్నారు. క‌ర్నాట‌క నుంచి తిరుమ‌ల వ‌స్తున్న వాహ‌నం వ‌ర‌ద‌నీటికి నీటిలో మునిగిపోయింది. అందులో ప్ర‌యాణించిన ఏడుగురు భ‌క్తులు జ‌ల‌దిగ్భ‌దంలో ఉన్నారు. అందులో అతి క‌ష్టం మీద ఆరుగురు బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే ఊపిరాడ‌క సంధ్య అనే న‌వ‌వ‌ధువు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. మ‌రోబాలిక ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో ఆసుప్ర‌తికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వాహ‌నం వ‌దిలి డ్రైవ‌ర్ ప‌రార‌య్యాడు.

ఈ ఘ‌ట‌న‌ను ఎవ్వ‌రూ అస‌లు ఊహించ‌రు. అనుకోకుండా అక‌స్మాత్తుగా జ‌రిగిన ఘ‌ట‌న ఇద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. నిన్న రాత్రి అక‌స్మాత్తుగా తిరుప‌తిలో భారీ వ‌ర్షం కురిసిన‌ది. రాత్రి కురిసిన వ‌ర్షానికి వెస్ట్ చ‌ర్చీ బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాదాపు 7 నుంచి 8 అడుగుల వ‌ర‌కు నీరు నిలిచిపోయింది. ఈ నేప‌థ్యంలోనే క‌ర్నాట‌క నుంచి ఏడుగురు భ‌క్తులు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చారు. తిరుమ‌ల‌కు వ‌స్తున్న స‌మ‌యంలో రోడ్డుమీద మొత్తం నీరు నిలిచాయి. నీరు ఎంత లోతు ఉన్నాయ‌నే విష‌యాన్ని డ్రైవ‌ర్ అంచెనా వేయ‌క‌పోవ‌డంతో వెళ్తున్న క్ర‌మంలోనే నీటి మ‌ధ్య‌లోనే  వాహ‌నం ఇరుక్కుపోయింది. దీని కార‌ణంగా లోప‌ల ఉన్నటువంటి ఏడుగురు భ‌క్తులలో అతిక‌ష్టం మీద ఆరుగురు బ‌య‌టికి వ‌చ్చారు. అందులో సంధ్య మృతి చెందింది. చీర ప‌ట్టుకొని కారులోంచి ఐదుగురు బ‌య‌టికి వ‌చ్చారు. ఇద్ద‌రు మాత్రం రాలేక‌పోయారు.

రాలేక‌పోయిన‌వారిలో సంధ్య ఊప‌రిఆడ‌క‌పోవ‌డంతో మృతి చెందింది. మ‌రొక చిన్నారి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ది. తిరుప‌తిలోని రియా ఆసుప‌త్రిలో చిన్నారి చికిత్స పొందుతున్న‌ది. కారులో ఇరుక్కుపోయిన ఏడుగురిలో ఆరుగురు చికిత్స పొందారు. వారిలో చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు కూడ ధృవీక‌రించారు. వారు మీడియాతో కూడ మాట్లాడారు. రాత్రి కారు నీటిలో ఇరుక్కుపోయిన‌ప్పుడు ఎవ‌రూ కూడ కాపాడ‌డానికి రాలేద‌ని.. డ్రైవ‌ర్ ప‌రార‌య్యాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాసేప‌టిలోనే తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటామ‌నే ఆనందంతో ఉన్న మాకు ఈ విధంగా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం అని పేర్కొన్నారు. సాధార‌ణంగా వెస్ట్ చ‌ర్చీ బ్రిడ్జ్ 7 అడుగుల పొడ‌వు ఉంటుంది. తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుందామ‌మ‌ని వ‌చ్చిన భ‌క్తుల‌కు పెనువిషాదం మిగిలింద‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: