ఉత్తరాఖండ్‌-హిమాచల్ సరిహద్దుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది . ప‌ద‌కొండు మంది ప‌ర్వ‌తారోహితులు ప్ర‌మాదంలో మృతి చెందారు . హిమపాతంలో చిక్కుకుపోయిన పర్వతారోహకులు 11 మంది మృతి చెంద‌డంతో విషాద చాయ‌లు అలుముకున్నాయి . హిమ‌పాతంలో చిక్కుకుపోయిన వారిలో ఇద్దరు ప్రాణాలతో భ‌య‌ట‌ప‌డ‌గా , మరో 5గురు గల్లంతు అయ్యారు . ఈ ఘ‌ట‌న‌ 17 వేల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద జ‌రిగిన‌ట్టు స‌మాచారం . హిమ‌పాతంలో చిక్కుకున్న వారిని ర‌క్షించేంద‌కు ఎయిర్‌ఫోర్స్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు . అంతే కాకుండా అడ్వాన్స్‌డ్ లైట్ హెలీకాప్టర్లతో సహాయ చర్యలు చేప‌డుతున్నారు . 

అక్టోబర్ 18న కురిసిన మంచు కార‌ణంగా ట్రెక్కర్స్ దారిత‌ప్పిన‌ట్టు తెలుస్తోంది . బృందంలో ట్రెక్కర్లతో పాటు పోర్టర్లు,  గైడ్లు సైతం ఉన్న‌ట్టు స‌మాచారం . అక్టోబర్ 20వ తేదీన వాయుసేనకు సమాచారం అందిన‌ట్టు తెలుస్తోంది . దాంతో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది . 15,700 అడుగుల ఎత్తులో నుండి 4 మృతదేహాలను వెలికితీశారు . అదేవిధంగా 16,800 అడుగుల ఎత్తులో ప్రాణాలతో ఉన్న ట్రెక్కర్ ను రెస్క్యూ ఆప‌రేష‌న్ సిబ్బంధి కాపాడారు .

మ‌రోవైపు అక్టోబర్ 22 న రెస్క్యూ టీమ్ మరో వ్యక్తిని కూడా ప్రాణాలతో కాపాడారు . అదే రోజున‌మరో 5 గురి మృతదేహాలను రెస్క్యూ సిబ్భంది స్వాధీనం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది . డోగ్రా స్కౌట్స్, అస్సాం రైఫిల్స్, ఐటీబీబీ బృందాలు జాయింట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో మరో రెండు మృతదేహాలను గుర్తించిన‌ట్టు తెలుస్తోంది . ప్ర‌స్తుతం గల్లంతైన మిగతావారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది . ఇక ఈ ఘ‌ట‌న ప‌ద‌కొండు మంది కుటుంబాలో తీవ్ర విషాదాన్ని నింపింది .

మరింత సమాచారం తెలుసుకోండి: