దేశం లో ప్రేమ పేరుతో ఘోరమైన దారుణాలు జరుగుతున్నాయి. కామ వాంఛ కోసం ప్రేమ అనే పేరు పెట్టి నమ్మించి ఓ అభాగ్యురాలిని నిలువునా మోసం చేసి పరారయ్యాడు ఓ నీచుడు. రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాని చెప్పి ఆమె వెంటపడి పెళ్లికూడా చేసుకుంటానని నమ్మించాడు. అది నిజమని నమ్మి అతడి మాటలకూ మోసపోయి అతనికి దగ్గరయింది . దానికి ప్రతిఫలం ఆమె గర్భవతి అయ్యింది. పెళ్లిచేసుకోమని అడిగితే కుల ప్రస్తావన తీసుకువచ్చాడు. మసస్థాపం చెందిన యువతీ వెంటనే ఊరి పెద్దలకు ఈ విషయాన్నీ చెప్పడంతో అతడికి చివాట్లు పెట్టి ఇద్దరికీ పెళ్లి చేశారు . పెళ్ళైన కొద్దిరోజులకే అతడు ఆమెను విడిచి పారిపోయాడు. దింతో ఆ అభాగ్యురాలు ఆమె అత్తవారి ఇంటి ముందు భైటాయించింది. ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నా అతని జాడ కనిపించలేదు. అత్తమామలు అతడి గురించిన విషయాలు బయటకు చెప్పడం లేదు.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో చోటుచేసుకుంది. డైలీ మార్కెట్ ప్రాంతం లో నివాసం ఉంటున్న నర్రు చిన్నబాబు ,రౌతు వందన ఇంటి ముందు నివాసముండేవాడు. ఈ క్రమం లోనే చినబాబు ఆమెను చూసి మోజుపడ్డాడు ఎలాగైనా సరే ఆమెను పొందాలనుకున్నాడు. అయితే వెంటనే మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఆమెను ప్రేమ పేరుతో లొంగదీద్దాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమెను ప్రేమ లోకి గుంజాడు . ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. నిజమేమో అని అని నమ్మిన వందన అతడిని ప్రేమించింది. ఈ క్రమంలోనే వందన గర్భవతి అయ్యింది. దింతో చినబాబుకు పెళ్లిచేసుకోమని నిలదీసింది. దాంతో చినబాబు ప్లేటు ఫిరాయించాడు ..కులం సాకుచెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.





కానీ వందన అతడిని ఘాడంగా ప్రేమించడంతో అతడిని వదులుకోలేక జరిగిన విషయాన్నీ పెద్దలో పెట్టి న్యాయం జరపాలని కోరింది.  పెద్దలు వారికీ చీవాట్లుపెట్టి జూన్‌ 20న అమ్మవారి ఆలయంలో వివాహం జరిపించారు. వందన మాదిగ కులానికి చెందింది కావడంతో చినబాబు తల్లితండ్రులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు భార్యాభర్తలు వందన అన్న ఇంట్లో అద్దెకు వెళ్లారు. అయితే పెళ్ళైన 10 రోజులకే  అనగా జూన్‌ 20న చినబాబు ఇంటినుండి పరారయ్యాడు. వెంటనే వందన అతడిపై మిస్సింగ్ కేసు నమోదు చేసింది .





 ఇప్పటికి ఐదు  నెలలు కావస్తూవుండడంతో వందన తన అత్తమామలను నిలదీసింది కానీ వారు చెప్పే సమాధానం ఎటుపొంతన కాకపోవడంతో తన అత్తమామలు అతడిని ఎక్కడో దాచిపెట్టారని భావించి అతన అత్తామామలపైకూడా కేసు పెట్టి వారి ఇంటిముందు భైటాయించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు స్పందించారు   పెట్టిన  ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసుని  నమోదు చేశామన్నారు. కేసు పెట్టినప్పటినుండి అతడి  కోసం గాలిస్తున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: