దేశ రాజ‌ధాని న‌గ‌ర‌మైన ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం చేసుకున్న‌ది. ఈ అగ్ని ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉన్న‌ట్టుండి మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా ఓల్డ్ సీమాపురి ప్రాంతంలోని మూడు అంత‌స్థుల భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ మంట‌ల్లో చిక్కుకుని న‌లుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. వారంద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం విశేషం. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల స‌మ‌యంలో చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌మాదం సంభ‌వించిన వెంబ‌డే స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి సమాచారాన్ని చేర‌వేశారు. దీంతో వారి స‌మాచారంతో హుటాహుటిన అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. వెంట‌నే మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారు. అప్ప‌టికే ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. వారు ఆ మంట‌ల్లో చిక్కుకొని పొగ‌తో ఊపిరిఆడ‌కా ఉక్కిరిబిక్కిరి అయి ప్రాణాలు కోల్పోయార‌ని అధికారులు వెల్ల‌డించారు. బాధితులు హోరిలాల్ (58), అతని భార్య రీనా (55), వారి కుమారుడు అష్షు(24), కుమార్తె  రోహిణి (18) లు ప్రాణాలు కోల్పోయారు.

వీరి మ‌రో కుమారుడు అక్ష‌య్‌(22) రెండ‌వ అంత‌స్థులో నిద్ర పోయాడు. కుటుంబం మొత్తంలో అత‌ను ఒక్క‌డే ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు.  హోరిలాల్ గ్రూప్‌-4 ఉద్యోగి. 2022 మార్చిలో రిటైర్ అవ్వాల్సి ఉంది. ఆయ‌న భార్య మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో స్వీప‌ర్‌గా ప‌ని చేస్తోంది.  వారి కుమారుడు ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కుమార్తె ఇంట‌ర్ చ‌దువుతోంది. బ‌తికి ఉన్న కుమారుడు అక్ష‌య్ లేబ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. మ‌స్కిటో కాయిల్ నుంచి మంట‌లు చెల‌రేగిన‌ట్టు ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది. దాని నుంచి వ‌చ్చిన పొగ‌తోనే ఊపిరాడ‌క వారు ప్రాణాలు కోల్పోయారు.  మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఢిల్లీలోని ఇరుకు గ‌దిలో జ‌రిగిన ఈ అగ్ని ప్ర‌మాదంపై ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందారు. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించ‌గా.. వారు స‌కాలంలో చేరుకొని మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: