హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఒక ఘటన అందరిని కంగారు పెట్టింది. ఆ ఘటనలో చిన్నారి మృతదేహం దొరకడం తో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు దాదాపు పది రోజుల నుంచి సీరియస్ గా దృష్టి పెట్టినా సరే ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరిగింది ఏంటీ అనేది స్పష్టత రాలేదు. ఇక ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పంజాగుట్ట బాలిక మృతి మిస్టరీ తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. బాలిక మృతికి కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కన్న తల్లి, తన ప్రియుడితో కలిసి పాపను  హత్య చేసినట్టు పోలీసుల గుర్తింఛి వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్ లో నిందితులైన తల్లి హీన బేగం, ప్రియుడు షేక్ మొహమ్మద్ ఖాదర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు... రిమాండ్ కు తరలించారు. ప్రియుడు ఖాదర్ ది డబీర్ పురా, పాప తల్లిది మియపూర్ అని పోలీసులు పేర్కొన్నారు. టెడ్డి కాంపౌండ్ షెక్ పేట్ లో ఖాదర్ తో హీన భేగం కు పరిచయం ఏర్పడింది అని పోలీసులు వివరించారు. ఖాదర్ తో తన సమస్యలు చెప్పుకున్న హీన భేగం ఆ తర్వాత అతనికి దగ్గర అయింది అని పోలీసులు పేర్కొన్నారు.

అనంతరం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది అని ఆ సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది అని వివరించారు. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్ మనాలి వెళ్లారు.. అక్కడ పిల్లల చేత భిక్షాటన చేయించారు అని అన్నారు. చిన్నారి బేబీ మెహక్  బెగ్గింగ్ చెయ్యడం ఇష్టం లేక పోవడంతో ప్రతిఘటించింది అని నాన్న దగ్గరికి వెళ్తానని గొడవ చేయడంతో చిన్నారిని దారుణంగా కొట్టి ఖాదర్,హీన బేగం హత్య చేసారని చిన్నారిని బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకు వచ్చి పంజాగుట్ట ద్వారాకపురి కాలనిలో ఓ షాపు వద్ద వదిలి వెళ్ళారు అని పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ఛేదించడం కష్టం అయింది అన్నారు. నిందితులు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం మేరకు జూబ్లీ బస్టాప్ లో నిందితులను అరెస్ట్ చేసాము అని తెలిపారు. నిందితులు ఇద్దరిని రిమాండ్ కు పంపాము అన్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: