భార‌త‌దేశ నేర చ‌రిత్ర‌లోనే అత్యంత హేయ‌మైన ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చిన‌ది. ఒక మైన‌ర్ బాలిక‌పై దాదాపు 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్ప‌డినారు. చాలా పేద‌రికంలోనూ త‌న సొంత కాళ్ల‌పై తాను నిల‌బ‌డేందుకు ఆమె చేసిన ప్ర‌య‌త్నాల‌ను ఆస‌రాగా తీసుకొని ప‌రిచ‌యం అయిన ప్ర‌తివాడు ఆమెకు ఉద్యోగం ఇప్ప‌స్తాను అని చెప్పి.. శారీరిక వాంఛ‌ను తీర్చుకునేందుకు చూసారు. పోలీస్ స్టేష‌న్ కు వెళ్లితే కూడ ర‌క్షించాల్సిన పోలీసులే లాడ్జీకి తీసుకువెళ్లి అత్యాచారం చేసారు.

వీట‌న్నింటినిపై ఆ బాలిక ఆరోపణ‌లు చేసిన‌ది. వ‌రుస‌గా ప‌లువ‌రు అత్యాచారం చేయ‌డంతో ఆ బాలిక గ‌ర్భం దాల్చిన‌ది. ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో శిశు సంక్షేమ శాఖ‌ను ఆశ్ర‌యించిన‌ది. అధికారుల సాయంతో బాలిక పై అత్యాచారం చేసిన వారిపై కేసు న‌మోదు అయింది. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న‌పై బీడ్ జిల్లా ఎస్పీ ఆర్‌.రాజా మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. బీడ్ జిల్లా, అంబేజోగా తాలుకాలోని ఒక గ్రామానికి చెందిన బాధిత బాలిక‌ది అత్యంత పేద‌రిక కుటుంబం. త‌ల్లిదండ్రులు దిన‌స‌రి కూలీలు. ఆ బాలిక‌ను వారి స్థోమ‌త‌కు త‌గ్గట్టు కాస్త చ‌దివించారు. రెండేండ్ల క్రిత‌మే అనారోగ్యంతో త‌ల్లి మృతి చెందిన‌ది. కూతురును సాక‌లేని తండ్రి.. ఆ బాలిక వ‌య‌స్సును ఆలోచించకుండానే బాల్య‌వివాహం చేసారు. అత్తారింటికి చిన్న‌వ‌య‌స్సులోనే అడుగు పెట్టిన ఆమెకు మాకు నుంచి వేధింపులు ప్రారంభ‌మ‌య్యాయి.

భ‌ర్త  కూడ త‌న తండ్రికే మ‌ద్ద‌తునిచ్చేవాడు. దాదాపు సంవ‌త్స‌రం పాటు అత్త‌వారింట్లో క‌ష్టాల‌ను ఎదుర్కున్న బాలిక చివ‌ర‌కు నాన్న వ‌ద్ద‌కు చేరుకున్న‌ది. అక్క‌డ ఖాళీగా ఉండ‌డం ఇష్టం లేక ఏదైనా ఉద్యోగం చేయాల‌నే ఆశ‌తో ఆరు నెల‌ల కిందే అంబేజోగై ప‌ట్టాణానికి చేరుకున్న‌ది.  జోగైలో ఓ కోచింగ్ సెంట‌ర్‌లో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు బాలిక‌కు ప‌రిచ‌య‌మై ఉద్యోగం ఇప్పిస్తాం అని, మాయ మాట‌లు చెప్పి అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. వారితో పాటు వాళ్ల స్నేహితులు కొంద‌రూ ఇదే సాకుతో బాలిక‌పై లైంగిక‌దాడి చేసారు.


కేవ‌లం ఆరు నెల‌ల కాలంలోనే సుమారు 400 మంది అత్యాచారం చేసారని ఆ బాలిక చెప్ప‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు న్యాయం చేయాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ది.  ఎస్పీ ఆదేశాలు ఇచ్చిన త‌రువాత‌నే అంబేజోగై పోలీస్ స్టేష‌న్‌లో బాధితిరాలు ఇచ్చిన ఫిర్యాదు న‌మోదైంది. అందులో ఇద్ద‌రు కానిస్టుబుల్ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఎస్పీ ఆదేశించారు. బాధిత బాలిక ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 10 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. అందులో న‌లుగురిని అరెస్టు చేసారు. మిగిలిన వారి కోసం గాలింపులు చేప‌డుతున్నారు అక్క‌డి పోలీసులు.  బాలిక గ‌ర్భం దాల్చ‌డం, అందులో మైన‌ర్ కావడంతో శిశు సంక్షేమ శాఖ అబార్ష‌న్ చేయించేందుకు ఏర్పాట్ల‌ను సిద్ధం చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: