వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో మ‌రోసారి ర్యాగింగ్ క‌ల‌క‌లం రేగిన‌ది. ప్రెష‌ర్స్ డే  సంద‌ర్భంగా సీనియ‌ర్ విద్యార్థులు జూనియ‌ర్ల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించార‌ని,  ర్యాగింగ్ చేస్తున్నారంటూ ఓ విద్యార్థి ప్ర‌ధాని మోడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర వైద్య సంచాల‌కుల‌కు ట్యాగ్ చేస్తూ  ట్వీట్ చేశారు. ఈ ఘ‌ట‌న ఆదివారం వెలుగులోకి వ‌చ్చిన‌ది. 2017 బ్యాచ్‌కు చెందిన సుమారు 50 మంది సీనియ‌ర్ విద్యార్థులు మ‌ద్యం సేవించి త‌మ‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని ట్విట్‌లో పేర్కొన్నారు. ఈ విష‌యంపై క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మోహ‌న్‌దాస్‌ మాత్రం అలాంటిది ఏమి లేద‌ని స‌మాధానం చెప్ప‌డం గ‌మ‌నార్హం.

 సీనియ‌ర్ విద్యార్థుల హాస్ట‌ల్ భ‌వ‌నాలు జూనియ‌ర్ విద్యార్థుల‌కు చాలా దూరంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు ప్రిన్సిపాల్‌. అయితే సీనియ‌ర్లు కొంద‌రూ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నార‌ని, అందులో కొంద‌రు గిట్ట‌ని వారు ఇలా చేసి ఉంటార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అదేవిధంగా కేఎంసీలో సోమ‌వారం జ‌రిగాల్సిన ప్రెష‌ర్ డే వేడుక‌కు అనుమ‌తి ఇవ్వ‌వ‌ద్ద‌ని డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యూకేష‌న్ డాక్ట‌ర్ ర‌మేష్ రెడ్డి సూచించారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న ఆరా తీసి ప‌లు సూచ‌న‌లు చేసారు.

ట్విట్ట‌ర్‌లో వ‌చ్చిన  ఫిర్యాదుతో పోలీస్ క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో మ‌ట్టేవాడ పోలీసులు కేఎంసీలో విచార‌ణ చేప‌ట్టారు. ర్యాగింగ్ జ‌రిగిన‌ట్టు త‌మ‌కు ఏ విద్యార్థి కూడ ఫిర్యాదు చేయ‌లేద‌ని సీఐ గ‌ణేష్ వెల్ల‌డించారు. అయితే  కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో నిత్యం ర్యాగింగ్ జ‌రుగుతున్న‌ద‌ని ప‌లువురు విద్యార్థులు చ‌ర్చించుకుంటున్నారు. రెండు నెల‌ల కింద‌టే ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమార్తెను కేఎంసీలో ర్యాగింగ్ చేయ‌డం క‌ల‌క‌లం రేకేత్తిన విష‌యం విధిత‌మే. తాజాగా వారంతా తప్ప తాగి జూనియర్ మెడికోల పట్ల అనుచితంగా వ్యవ హరిస్తొన్నారు. ఇదంతా వరంగల్ కేఎంసీలోని న్యూమెన్స్ హాస్టల్-1లో జరుగుతున్న‌ద‌ని,  దయ చేసి కాపాడండి” అని ట్విట్‌లో కోరాడు. ట్విటర్లో చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా విచారణకు సిద్ధపడ్డారు పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: