రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. కనీసం మనిషికి మనిషికి మధ్య సంబంధాలు అనేవి, ప్రేమానురాగాలు అనేవి కనిపించడం లేదు. ఇక ఆడ పిల్లల విషయానికి వస్తే  కొంతమంది మృగాల చేతిలో తీవ్రంగా చిత్రహింసలు అనుభవించి చివరికి మరణిస్తున్నారు. ఈ కామాంధులు చిన్నపిల్లల నుంచి  ముసలి తల్లుల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. అసలు ఎందుకిలా జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే. జార్ఖండ్ రాష్ట్రంలోని  గొడ్డ పట్టణంలోని భారతీకిట గ్రామంలో నివాసం ఉంటున్న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. చివరికి ఆ అమ్మాయి ప్రసవించి అప్పుడే మరణించింది. కానీ ఆ మైనర్ బాలిక పెళ్లి కాకుండానే  ప్రసవం జరిగింది. ఎలా జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు.

చివరికి ఈ విషయం ఎవరికి  తెలియకుండా బయటకు రాకుండా చూద్దాం అనుకున్నారు. చివరికి పోలీసులకు తెలిసిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు  షాకింగ్ నిజాలు చవిచూశారు. నవంబర్ 12వ తేదీన  గొడ్డ జిల్లాలోని భారతీకిత గ్రామంలో  అభయ్ కుమార్ అనే  వ్యక్తి ఇంట్లో ఈ బాలిక పని చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే  ఆ వ్యక్తి ఆ అమ్మాయి లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక తొమ్మిది నెలల గర్భవతి అయి  చివరికి ఒక పసికందుకు జన్మనిచ్చిన మరణించింది. దీంతో అబ్బాయి కుమార్ సాక్ష్యాధారాలను దొరకకుండా బాలిక కుటుంబ సభ్యులను కాంప్రమైజ్ చేసి అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నాలు చేశాను.  దీన్ని పోలీసులు గుర్తించి  అమ్మాయి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించి అభయ్ కుమార్ ను అరెస్టు చేశారు. చివరికి ఆ శిశువును సిడబ్ల్యుసి అప్పగించారు. ఇక నుంచి ఆ శిశువు బాధ్యత సిడబ్ల్యుసి వారు చూసుకుంటారని తెలియజేశారు. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: