రోజు రోజు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాలు మాత్రం  ఆగడం లేదు. అందుకోసమే పాకిస్తాన్ ప్రభుత్వం  కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి ఎవరైనా అత్యాచారం పాల్పడితే ఈ కొత్త చట్టం ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటోంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులను లైంగికంగా అసమర్థులు చేయడం కోసం ఈ బిల్లును పార్లమెంటు ముందు పెట్టింది. దీనికి ఆమోదం కూడా లభించింది. ఇక ఇది అమలైతే మృగాలకు  అత్యాచారం అనే ఆలోచన వస్తేనే ఈ చట్టం గుర్తుకు రావాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని మరోసారి లైంగికంగా  మరోసారి  లైంగిక సామర్థ్యం లేకుండా  కీలక బిల్లులు తీసుకువస్తున్నట్లు  పాకిస్తాన్ ప్రభుత్వం తెలియ జేసింది.

 ఈ యొక్క బిల్లు నేర చట్టం సవరణ 2021 పార్లమెంటులో ఆమోదం పొందింది. దీంతో పాటుగా మరో 33 బిల్లులను  కూడా పార్లమెంట్ ఆమోదించింది. పాకిస్థాన్ దేశంలో రేప్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న సందర్భంగా నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ఆలోచనతో ప్రజల నుండి డిమాండ్ రావడంతో ప్రభుత్వం ఆలోచించి ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నటువంటి ఆర్డినెన్స్ ను గత సంవత్సరం పాకిస్తాన్ క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసింది. అత్యాచారం చేసిన నిందితులకు లైంగిక సామర్థ్యాన్ని తొలగించే పద్ధతిని "కెమికల్ కాన్సన్ట్రేషన్" అని అంటారు. దీనిలో వైద్యులు డ్రగ్స్ ను యూజ్ చేసి నిందితులు మరోసారి శృంగారం పనికిరాకుండా చేసేస్తారు. పోలాండ్, దక్షిణ కొరియా, అమెరికా, చెక్ రిపబ్లిక్ సహా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క శిక్ష అమలులో ఉన్నది. పాకిస్థాన్ దేశంలో నమోదయ్యే అత్యాచార కేసుల్లో నాలుగు శాతం మందే దోషులుగా తేలిన ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉంటే నిందితులకు కెమికల్ కంస్టేషన్ శిక్ష విధించడం అనేది సరికాదని  జమాతే ఇస్లామీ సెనేటర్ అయినా  ముక్తాప్ అహ్మద్  నిరసన తెలియజేశారు. ఈ యొక్క బిల్లు ఇస్లాం మరియు షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉందని, అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయడం అనేదే సరైందని, కానీ షేరియా  చట్టం ప్రకారం కెమికల్ కన్స్ట్రక్షన్ శిక్ష ప్రస్తావన అనేది ఎక్కడ లేదని వాదన చేశారు. ప్రస్తుతం వారి యొక్క లైంగిక సామర్థ్యాన్ని తొలగించే శిక్షను విధించి, ఉరిశిక్షపై తర్వాత ఆలోచిద్దామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: