ప్రస్తుతం సమాజంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులన్నీ రక్తపు మాడుగుల తయారవుతున్నాయి. కొన్ని సార్లు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొన్ని సార్లు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించకుండా ప్రాణాలను కోల్పోతున్నారు. ఒక్క వైపు అధికారులు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని.. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా..ప్రమాదాలు జరగొచ్చు. ప్రాణాలు పోవచ్చు అని చెబుతూనే ఉన్నారు.

రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా కారు, బస్సు వంటి వాహనాల్లో వెళ్తున్నప్పుడు కిటికీలో నుంచి చేతులు గానీ, తల గానీ బయట పెట్టకూడదని హెచ్చరికలు చేస్తుంటారు. దానికి ఓ కారణం ఉందండి.. అదేంటంటే.. మనం ప్రయాణిస్తున్న వాహనం పక్క నుంచే ఇతర వాహనాలు వెళ్తుంటాయి. అలాంటి సమయంలో తల, చేతులు వాటికి తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో తగు చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతుంటారు. కానీ ఆ మాటలను పేడ చెవిన పెట్టి ప్రయాణికులు ఆ;అలాగే ప్రయాణం చేస్తుంటారు. ఆలా నిర్లక్ష్యంతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో  చోటు చేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ స్నేహితురాలి వివాహానికి వేర్వేరు ప్రాంతాలు చెందిన యువతీ యువకులు హరాజరైయ్యారు. వారిలో ఒక్కరు లోహిత్ రాణి అనే యువతి. లోహిత్ రాణి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం. పెళ్ళికి వెళ్లిన స్నేహితులందరూ గౌరీపట్నంలోని లోహిత్ రాణి ఇంట్లో స్టే చేశారు. దూర ప్రయాణం చేసి వచ్చినందుకు దగ్గరలోని పర్యాటక ప్రాంతాలను చూడాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే గౌరీపట్నం నుంచి కారులలో మారేడుమిల్లికి అందరు బయలుదేరారు. అయితే లోహిత్ రాణి చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది. ఇక అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడింది. స్నేహితులు వెంటనే ఆమె ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: