ఇటీవలి కాలంలో చదువు ఆన్ లైన్  మయం అయిపోయింది. కరోనా వైరస్ కారణంగా అందరూ కూడా ఆన్లైన్ తరగతులు ద్వారానే విద్యాబోధన కొనసాగించారు అన్న విషయం తెలిసిందే. ఆన్లైన్ తరగతులు లో భాగంగా విద్యార్థులందరికీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం.. ఇక వాట్సాప్ గ్రూప్ లో కీలకమైన సమాచారాన్ని ఉపాధ్యాయులు విద్యార్థుల తో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. కరోనా వైరస్ సమయంలో ప్రతీచోటా ఇక ఇలాంటిదే జరుగుతుంది అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే కొంతమంది ఉపాధ్యాయులు వక్ర బుద్ధి తో ఆలోచిస్తూ దారుణానికి పాల్పడుతూ ఉన్నారు. తమ దగ్గర చదువుకున్న పిల్లలను సొంత బిడ్డలా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు నీచంగా ఆలోచిస్తున్నారు. ఏకంగా విద్యార్థులు అందరూ ఉన్న వాట్సాప్ గ్రూపులో అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలు కాస్త సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఇలాంటి పనికి ఒడిగట్టాడు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు.


 ఈ క్రమంలోనే ఈ వాట్సాప్ గ్రూపు లో ఏకంగా అశ్లీల వీడియోలు కు సంబంధించిన లింకులు షేర్ చేశాడు ఆ ఉపాధ్యాయుడు   ఇది చూసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ క్రమంలోనే ఇలాంటి అశ్లీల వీడియోలు లింకులు షేర్ చేసిన ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. ఐదో తరగతి వాట్సాప్ గ్రూప్లో జిల్లాలోని 28 పాఠశాలలకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు 65 మంది మహిళా టీచర్లు కూడా  ఉన్నారు. అయితే ఇటీవలే ఉపాధ్యాయుడు కృపాకర్ పోర్న్ వీడియో లింక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి కాసేపటికే దాని తొలగించాడు. అయితే పొరపాటు చేశానని మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక ఇలాంటి టీచర్ పై చర్యలుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: