కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కుమార్తె జీవితంలో నిప్పులు పోసి నాశనం చేసాడు ఆ కామాంధుడు. క‌స్తుర్భా బాలిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న ఆ బాలిక లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి వ‌చ్చిన‌ది. అప్ప‌టి నుంచి ఇంట్లో ఉంటుండంతో.. త‌ల్లిదండ్రులు రోజు ప‌నికి వెళ్తుండేవారు. తండ్రి మాత్రం మ‌ధ్యాహ్న భోజ‌నానికి ప్ర‌తిరోజూ ఇంటికి వ‌చ్చేవాడు.  రోజు మాదిరిగానే ఓ రోజు మ‌ధ్యాహ్న భోజ‌నానికి వ‌చ్చిన ఆ తండ్రి ఇంట్లో ఒంట‌రిగా ఉన్న త‌న కూతురు బెదిరించి అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు.

కేవ‌లం ఒకే సంద‌ర్భంలో కాకుండా ప‌లుమార్లు వీలు ఉన్న‌ప్పుల్లా మూడు నెల‌ల కాలం నుంచి లైంగిక దాడికి పాల్ప‌డుతూనే ఉన్నాడు. ఈ మ‌ధ్య కాలంలో కూతురు కాస్త నీర‌సంగా ఉండ‌డం గ‌మ‌నించి త‌ల్లి నాలుగు రోజుల కింద‌ట ఆసుప‌త్రికి తీసుకెళ్లింది. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు  ఆ బాలిక గ‌ర్భం దాల్చింద‌ని ధృవీక‌రించారు. త‌ల్లి కూతురును నిల‌దీయంగా ఆమె చెప్పి జ‌వాబు విని షాక్‌కు గురైంది.
 
వికారాబాద్ మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన త‌ల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం న‌గ‌రంలోని ప‌టాన్ చెరు వెళ్లి అక్క‌డే నివ‌సిస్తున్నారు. అయితే వీరి కుమార్తె క‌స్తూర్భాలో చ‌దువుకుంటుంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికి రావ‌డంతో ఆ స‌మ‌యంలో బాలిక ఇంటి వ‌ద్దే ఉండ‌డం.. తండ్రి ప‌నికి వెళ్లి మ‌ధ్యాహ్నం భోజ‌నానికి రావ‌డంతో కూతురును వేధించి.. బెదిరించి ప‌లుమార్లు  లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అయితే బాలిక‌ను త‌ల్లి ఎవ‌రినైనా ప్రేమించావా..?  చెప్పు అని.. క‌చ్చితంగా పెద్ద‌ల‌తో మాట్లాడి నీకు పెళ్లి చేస్తాం అని గ‌ట్టిగా నిల‌దీయంతో కూతురు ఏడుస్తూ ప‌టాన్ చెరులో ఉన్న స‌మ‌యంలో తండ్రి త‌న‌పై లైంగిక‌దాడి చేసాడ‌ని వాపోయింది. దీంతో కూతురు చెప్పిన మాట‌లు విన్న త‌ల్లి త‌ల్ల‌డిల్లి క‌న్నీటి ప‌ర్వంత‌మైంది.  వెంట‌నే భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట ఠాణా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: